అంతా ధర్మకర్తల మండలి ఆదేశాల మేరకేనని చెప్పిన మాజీ ఇఒ 15న మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి తిరుపతిలో అలిపిరి లోని పాత ఎస్వీబిసి కార్యాలయం ప్రాంగణంలోని సిట్ తాత్కాలిక కార్యాలయం చేరుకున్నారు. కారులోంచి దిగిన ధర్మారెడ్డి మీడియా కంట పడకుండా సిట్ అధికారులు చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం 1.30గంటల వరకు సిట్ డిఐజి మురళీ రంభ పలు ప్రశ్నలు సంధించి వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. 2019వ సంవత్సరంలో రాష్ట్రం లో వైసిపి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కేంద్ర సర్వీసుల నుండి ధర్మారెడ్డిని టిటిడి (TTD) అదనపు ఇఒగా డిప్యూటేసన్ పై తీసుకువచ్చారు. అప్పటి సిఎం జగన్మోహన్రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడుగా మెలగడంతో కొంతకాలానికి టిటిడి ఇఒగా కూడా ఈయనకే బాధ్యతలు అప్పగించారు.
Read also: Chandrababu: రాష్ట్రంలో ఒకేసారి 3లక్షల గృహ ప్రవేశాలు

TTD: ‘సిట్’ముందుకు కల్తీనెయ్యి సూత్రధారులు
లడ్డూల నాణ్యత లేదని
ఆయన ఇఒగా పనిచేసిన హయాంలో టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ గా జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డి చైర్మన్ జంబో పాలకమండలి కొనసాగింది. ఆ కాలంలో తిరుమలకు 2020 నుండి 2024 మేనెల వరకు నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్లు పిలవడం, పాల్గోన్న సంస్థలు, వాటికి నెయ్యి సరఫరాకు సామర్థ్యం ఉందా, ఎంతవరకు టెండర్లు దక్కించుకుని ఎంతకాలం సరఫరా చేశారు అనే వివరాలు ధర్మారెడ్డిని అడిగి సమాధానాలు రాబట్టారనేది తెలుస్తోంది. కల్తీనెయ్యి సరఫరా జరిగినా, లడ్డూల నాణ్యత లేదని, ఒకరకమైన వాసన వస్తోందని అప్పట్లోనే భక్తుల నుండి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినా ఎందుకు తనిఖీ చేయలేదని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే అంతా నాణ్యతతోనే తయారైందని తెలిపినట్లు, కరోనా సమయంలో కూడా నిబంధనలు పాటించి లడ్డూలను తయారు చేశామని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.
కల్తీనెయ్యి వినియోగించారు
ఈ వివరాలన్నీ సిట్ వీడియో రికార్డు చేసినట్లు ఉంది. అదేగాక పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీకి ఎంత కాలంగా కల్తీనెయ్యి వినియోగించారు? అసలు నెయ్యిసర ఫరాకు టెండర్లు చేజిక్కించుకున్న సంస్థలకు బదులు నెయ్యి కాంట్రాక్టర్ల స్థానంలో ఇతరులు సరఫరా చేసినా ఎందుకు ప్రశ్నించ లేకపోయారనేది సిట్ కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. తమిళనాడులోని దిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీ నుండి నాణ్యత నెయ్యి వచ్చిందా లేదా ఎందుకు తనిఖీ చేయించలేదనే కోణంలో సిట్ వివరాలు రాబట్టింది. ఇంత దారుణానికి ఎవరు పాల్పడ్డారనే అంశంలో, లడ్డూ తయారీలో నెయ్యి, ముడిసరుకులు శనగపండి, యాలకులు, జీడిపప్పు, ఎండుద్రాక్ష నాణ్యత ఉన్న వాటిని ఎక్కడ నుండి దిగుమతి చేసుకున్నానే వివరాలు సిట్ రాబట్టింది. నెయ్యి నాణ్యత లేదని దీనివల్లే ఐదేళ్ళు లడ్డూలు నాణ్యత లేదని కీలకంగా పోటు వైష్ణవ బ్రాహ్మణులు సమాచారం కూడా ధర్మారెడ్డి ముందు వుంచారు.
సుబ్బారెడ్డికి నోటీసులివ్వడం
కొన్నిటికీ సమాధానాలు దాటవేశారని తెలుస్తోంది. మీ హయాం లో 2023 డిసెంబర్ నెల నుండి 2024 మేనెల వరకు టిటిడికి నెయ్యి సరఫరా చేయడానికి టెండర్లులో పాల్గొన్న సంస్థలు, సరఫరా చేసిన సంస్థలు, వారు చేసిన కల్తీ బాగోతం వివరాలను కొన్ని ఆధారాలతో చూపి సమాధానాలు రాబట్టారని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు పాత్రధారుల రిమాండ్ రిపోర్టు మేరకు ఉన్న సమాచారంతో సిట్ విచారణ చేయడం చివరకు టిటిడిలో బోర్డునే (పాలకమండలి) సుప్రీమ్ అని, బోర్డు చెప్పినట్లు చేయడం అధికారుల బాధ్యత అని సిట్కు పూర్వ ఇఒ ధర్మారెడ్డి సమాధానాలు ఇవ్వడంతో కొంత ఆశ్చర్యం చెందారు. అయితే ఈ కల్తీనెయ్యి వ్యవహారంపై మరికొంత సమాచారం రెండవరోజు నేడు కూడా ధర్మారెడ్డిని విచారణ చేసే అవకాశం ఉందని తెలిసింది. మరీ నేడు ఆయన నుండి ఎలాంటి సమాచారం సేకరించనుంది, తదుపరి చర్యలు తీసుకుంటుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇదే కల్తీనెయ్యి కేసులో 13వతేదీ గురువారం విచారణకు రావాలని సిట్ అధికారులు టిటిడి మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డికి నోటీసులివ్వడం సంచలనంగా మారింది. కానీ నోటీసులందుకున్న ఆయన 15వతేదీ శనివారం విచారణకు వస్తానని సమాధానమిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: