ప్రముఖ యాంకర్ శివజ్యోతి(TTD) చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద వివాదంగా మారింది. తిరుమలలో శ్రీవారికి నమస్కారం చెప్పిన అనంతరం తీసుకున్న ప్రసాదాన్ని కెమెరా ముందు చూపిస్తూ ‘కాస్ట్రీ బిచ్చగాళ్లం’ అంటూ చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వినిపించాయి. అంతేకాకుండా, ఆమెపై చర్యలు తీసుకోవాలని, తిరుమల దర్శనానికే నిషేధం విధించాలని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మొదలుపెట్టారు.
Read also: డేటా రాజధానిగా విశాఖపట్నం.. రిలయన్స్ భారీ పెట్టుబడులు

TTD స్పందనపై వెలుగులోకి వచ్చిన నిజాలు
ఇలా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, శివజ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ చేసిందని, ఆమె భవిష్యత్తులో తిరుమల(Tirumala) దర్శనం పొందకుండా (TTD) నిషేధం విధించిందని వచ్చిన వార్తలు పూర్తిగా తప్పుడు వెరైటీగా తేలాయి. ఇప్పటివరకు TTD నుంచి ఏ విధమైన అధికారిక ప్రకటన రావడం లేదు. ఆధార్ కార్డు బ్లాక్ చేయడం, దర్శన నిషేధం విధించడం వంటి విషయాలు సోషల్ మీడియా ప్రచారమే తప్ప వాస్తవమేమీ కాదని సమాచారం స్పష్టం చేస్తోంది.
అయినా, ఆమె వ్యాఖ్యలు భక్తుల్లో తీవ్ర అభ్యంతరాలను రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలను, అపోహలను క్లారిటీ చేయడానికి TTD నుంచి అధికారిక వివరణ వచ్చే అవకాశముంది. కానీ ప్రస్తుతానికి శివజ్యోతి దర్శనంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: