తిరుపతి కపిలతీర్థంలో (Kapila Theertham) పిండ ప్రధానం కార్యక్రమానికి టీటీడీ అనుమతి నిరాకరించిందన్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టత ఇచ్చింది. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ తెలిపింది. కపిలతీర్థం మెయిన్ గేట్ లోపల పిండ ప్రధానం నిర్వహించేందుకు కోరుతున్న స్థలం టీటీడీ పరిధిలోకి రాదని, అది అటవీ శాఖ ఆధీనంలో ఉన్న ప్రాంతమని వెల్లడించింది. తమ పరిధిలో లేని స్థలానికి అనుమతి ఇవ్వడం ఎలా సాధ్యమని టీటీడీ ప్రశ్నించింది.
Read also: Tirupati Crime : మహిళను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

Priests protest against performing Pinda Pradanam at Kapilatheertham
తప్పుడు ప్రచారంతో భక్తులు గందరగోళానికి గురికాకూడదని
టీటీడీ అనుమతి ఇవ్వలేదని అర్చకులు రోడ్డుపై పిండ ప్రధానం చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించి టీటీడీ సెక్యూరిటీ అడ్డుకుంటోందన్న వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది. టీటీడీకి సంబంధించిన ఏ సమాచారం అయినా అధికారిక వెబ్‌సైట్, పత్రికా ప్రకటనలు లేదా అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే వెలువడుతుందని గుర్తుచేసింది. తప్పుడు ప్రచారంతో భక్తులు గందరగోళానికి గురికాకూడదని విజ్ఞప్తి చేసింది.
మరోవైపు, తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారు జనవరి 25న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏడు వాహనాలపై భక్తులను అనుగ్రహించనున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు సూర్యప్రభ, హంస, అశ్వ, గరుడ, చిన్నశేష, చంద్రప్రభ, గజ వాహనాలపై ఊరేగింపు జరుగనుంది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజల సేవ, వేదాశీర్వచనం వంటి కొన్ని సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే జనవరి 20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం భక్తులకు సర్వదర్శనం ఉంటుందని వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: