
TTD: తిరుమల కొండపై కొందరు తమిళనాడు భక్తులు హద్దులు దాటి ప్రవర్తించిన ఘటన వివాదాస్పదంగా మారింది. రాజకీయ నేతల ఫొటోలు ఉన్న బ్యానర్‌తో ఆలయం ముందు రీల్స్ రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో శ్రీవారి భక్తులు టీటీడీ(Tirumala Tirupati Devasthanams) అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపై రాజకీయ కార్యకలాపాలు, ప్రచార సామగ్రిపై నిషేధం ఉన్నప్పటికీ సరైన పర్యవేక్షణ లేకపోయిందని ఆరోపిస్తున్నారు.
Read Also: Tirumala: కల్తీనెయ్యి కేసులో చిన్నఅప్పన్నకు గడ్డుకాలమే!
తిరుమల పవిత్రతకు భంగం: టీటీడీ కఠిన నిర్ణయం
శ్రీవారి ఆలయం ఎదుట అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత, మాజీ సీఎం పళనిస్వామి తదితర నేతల చిత్రాలతో వీడియోలు తీసినట్లు సమాచారం. ఈ చర్యలు ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఘటనపై టీటీడీ అధికారికంగా స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా ఆలయ పరిసరాల్లో రాజకీయ బ్యానర్ ప్రదర్శించి, రీల్స్ తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని టీటీడీ సీపీఆర్వో వెల్లడించారు. సంబంధిత భక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: