हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: TTD: పరకామణి కేసు నివేదిక రెడీ.. నేడు హైకోర్టుకు సమర్పించనున్న సిఐడి

Rajitha
News Telugu: TTD: పరకామణి కేసు నివేదిక రెడీ.. నేడు హైకోర్టుకు సమర్పించనున్న సిఐడి

తిరుపతి : జడ్జి ఆదేశాలపై అందరిలో ఉత్కంఠ వడ్డీకాసుల వేంకటేశ్వరస్వామికి భక్తులు కానుకలుగా సమర్పించిన వాటిని చోరీచేసిన కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టిన సిఐడి అధికారులు ఆ నివేదికలను మంగళవారం (రేపు) హైకోర్టుకు (High court) సమర్పించనున్నారు. నవంబరు 6వతేదీ నుండి పలు కోణాల్లో, పలువురిని విచారణ చేసి రాబట్టిన ఆధారాలు, వివరాలను రికార్డుచేసిన సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ బృందం నివేదికలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఉంచనున్నారు. తదుపరి న్యాయమూర్తి ఎలాంటి ఆదేశాలిస్తారనేది అందరిలోనూ ఉత్కంఠతగా మారింది. 2023 ఏప్రిల్ లో జరిగిన తిరుమల పరకామణిలో 920 అమెరికన్ డాలర్లు దొంగతనం, ఆ తరువాత విజిలెన్స్ అధికారులు పట్టుకోవడం, తిరుమల వన్డేన్ పోలీసు లకు అప్పగించడం జరిగింది.

Read also: D.CM Pawan: రాష్ట్ర అంశాలపై పార్లమెంట్లో గట్టిగా గళం విప్పాలి

Parakamani case report ready

Parakamani case report ready

పెద్దలు నిర్లక్ష్యంగా వ్యవహరించి

దీనిపై తదుపరి సమగ్రంగా చట్టప్రకారం నిందితుడు సివి రవికుమార్ పై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, అప్పటి టిటిడి పెద్దలు నిర్లక్ష్యంగా వ్యవహరించి, లోక్ఆదాలత్ ద్వారా రాజీ కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంలో నిందితుడు నుండి 14కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు శ్రీవారికి కానుకగా టిటిడి పెద్దలు రాయించుకోవడం పెద్ద వివాదాంశంగా మారింది. 2023-24లో వైఎస్సార్సీ ప్రభుత్వం, అప్పటి టిటిడి బోర్డు కలసి పరకామణి చోరీకేసును రాజీతో మూసేశారనేది ప్రధాన ఆరోపణలు. దీనిపై హైకోర్టుకు కేసు చేరడంతో సమగ్ర దర్యాప్తుకు సిఐడి డిజికి ఆదేశించింది. అయితే ఈ కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తుకు సిఐడి చీఫ్ రవి శంకర్అయ్యన్నార్, ఎసిపి, డిఎస్పీలు, సిబ్బంది కలసి నవంబర్ 6వతేదీ నుండి రంగంలోకి దిగారు. తోలుత నిందితుడు రవికుమార్ ను, అతని కుటుంబసభ్యులను విచారణ చేశారు.

తాడిపత్రి వద్ద

చోరీ ఎప్పటినుండి జరుగుతోంది, ఎలా ఆస్తులు సంపాదించారు వంటి అంశాలపై కూలంకుషంగా వివరాలు రాబట్టారు. ఆ తరువాత కీలకమైన విజిలెన్స్ పూర్వ ఎవిఎస్ వై. సతీశ్ కుమార్ ను ఒకసారి సిఐడి విచారణ చేసింది. విజిలెన్స్ ప్రమేయం కేవలం జరుగుతున్న నేరాలపై నిఘా ఉంచి పట్టుకోవడం, ఆ తరువాత టిటిడి పై అధికారుల ఆదేశాలతో పోలీసులకు అప్పగించడం వరకేనని సమాచారం. అయితే రెండవసారి విచారణకు తిరుపతికి వస్తుండగా ఆయన్ను తాడిపత్రి వద్ద ఆగంతుకులు హత్యచేశారనేది పోలీసులు నిర్ధారణ. వరుసగా తిరుమలలో పనిచేసిన మాజీ ఇఒ ఏవి ధర్మారెడ్డిని, మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, మాజీ సివిఎసి నరసింహకిషోర్ ను, అప్పటి తిరుమలలో పనిచేసిన సిఐలు జగన్ మోహన్ రెడ్డి, చంద్రశేఖర్, ఎస్ఐ ఐ లక్ష్మీరెడ్డిని కూడా సిఐడి విచారణ చేపట్టింది. వీరందరి నుండి సేకరించిన వివరాలు, రాబట్టిన ఆధారాల వాంగ్మూలాలను రికార్డుచేసింది.

ఆ రికార్డులను, ఎవరి తప్పిదాలు, ఎవరి ప్రమేయం ఎంతవరకు ఉందనే విషయాలను సిఐడి హైకోర్టు ధర్మాసనంకు సమర్పించనున్నారు. వీటిని పరిశీలించిన తరువాత తదుపరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెలువడించే ఆదేశాల ప్రకారం ఎవరెవరిని అరెస్ట్ చేస్తారనేది ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. భక్తులు కానుకలుగా సమర్పించిన వాటిని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి, అమెరికన్ డాలర్లు చోరీచేసినా చర్యలు ఎందుకు తీసుకోలేక పోయారని, పోలీస్ కేసు నమోదైన తరువాత చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేక పోవడం, రాజీచేయడం వెనుక ఎవరి పాత్ర ఉందనే కోణంలో టిటిడి మాజీ పెద్దలను, పోలీసు అధికారులను సిఐడి చీఫ్ రవి శంకర్అయ్యన్నార్ ప్రశ్నించి రాబట్టిన సమాచారం ఇప్పుడు కీలకం కానుంది. మాజీలు కూడా ఈ కేసులో ప్రమేయం ఎవరిదీ లేదని, చోరీ జరిగిన విషయం తనకు తెలియదని, తదుపరి పరిణామాలతో తనకెలాంటి సంబంధం లేదని పలు రకాలుగా సిఐడికి వాంగ్మూలం ఇవ్వడం కూడా జరిగింది. మరీ రేపు న్యాయమూర్తి ఇచ్చే ఆదేశాలపై తదుపరి సిఐడి చర్యలు ఏంటనేది ఉండబోతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870