తిరుమల : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి కోటి రూపాయలు విరాళాలిచ్చే దాతలకు తిరుమల తిరుపతి (Tirumala) దేవస్థానం వలు ప్రయోజనాలు చేకూరుస్తోంది. భారీ మొత్తంలో భారీగా విరాళాలిచ్చిన దాతలకు జీవితకాలంలో దాతతోబాటు మరో నలుగురికి ప్రతి ఏడాదిలో మూడురోజులు సుప్రభాతసేవ దర్శనాలు, మూడురోజులు విఐపి బ్రేక్ దర్శనాలు, నాలుగురోజులపాటు సుపథం ప్రవేశ దర్శనం ద్వారా ఆ దేవదేవుని దర్శనం చేసుకునే వెసలుబాటు కల్పించారు. ఈ ప్రయోజనాలతో బాటు ఒకసారి 10 పెద్ద లడ్డూలు, 20 చిన్నలడ్డూలు, ఒక దుప్పట, రవికె, 10 మహాప్రసాదం ప్యాకెట్లు బహుకరిస్తారు. ఏడాదిలో ఒకసారి దాతలైన భక్తులకు వేద ఆశీర్వచనం వంటి సౌకర్యం పొందవచ్చు.
Read also: Rammohan Naidu: మత్తు రహిత రాష్ట్రం లక్ష్యం

TTD
తిరుమలలో 3వేల రూపాయలు అద్దెతో కూడిన వసతి గదుల సదుపాయం మూడురోజులు కల్పిస్తారు. జీవిత కాలంలో దాతకు ఒకసారి ఐదు గ్రాముల బంగారు డాలర్, 50గ్రాముల వెండిడాలరు ఆధారాల్ని కార్యాలయంలో చూపి పొందవచ్చు. ఆనంద నిలయంలో కొలువైనా వేంకటేశ్వరస్వామిని ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా మళ్ళీ మళ్ళీ ఆ దివ్యమంగళరూపాన్ని చూడాలనే తాపత్రయం భక్తులకు కలుగుతుంది. సామాన్యభక్తులు ఆ దేవుని క్షణకాల దర్శనం కోసం పరితపిస్తుంటే ధనవంతులైన కోటీశ్వరులైన భక్తులకు, దాతలకు తిరుమల తిరుపతి దేవస్థానం బహుళ ప్రయోజనాలు చేకూరుస్తోంది. గతంలో కోటి విరాళమిస్తే వారికి ఏడాదిలో ఆరు మందికి ఉదయాస్తమాన సేవదర్శనం టిక్కెట్ (తెల్లవారుజామున సుప్రభాతం నుండి సాయంత్రం సహస్రదీపాలంకార సేవ వరకు) ఆలయం లోపల కులశేఖరపడి వద్ద నుండి వేంకటేశ్వరస్వామి కొలువైన ముందుకు వెళ్ళి తనివితీరా దర్శనం చేసుకునే వెసలుబాటు కల్పించింది.
అంతేగాక ఆ భక్తులకు సుప్రబాతం, తోమాల, అర్చన సేవలు కొందరు గృహస్థభక్తులు, విఐపి బ్రేక్కు మరికొందరు గృహస్థభక్తులను దాత తీసుకెళ్ళే ప్రయోజనం ఉండేది. ఆ విరాళాల్లో కొంత మార్పుచేసి కోటి రూపాయలు విరాళమిస్తే ఆ దాతలకు ఏడాదిలో మరిన్ని ప్రయోజనాలు, దేవుని దర్శనం, వసతి, ప్రసాదాలు అందించే దిశగా కార్యాచరణ రూపొందించి అమలుచేస్తారు. తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజుల్లో మినహాయించి మిగిలిన రోజుల్లో కోటి విరాళమిచ్చిన భక్తులు తమకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను సద్వినియోగం చేసుకునే వెసలుబాటు కల్పించారు. రూపాయలు, దాతలు 1.50 కోట్ల రూపాయలు
రూ.కోటి విరాళాలివ్వాల్సిన పథకాలు
దాతలు కోటిరూపాయలు విరాళాలివ్వాల్సిన టిటిడి ట్రస్ట్ లలో కాటేజీ డొనేషన్ స్కీం, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్, బర్డ్ ట్రస్ట్, ఎస్వీ అన్నదాన ట్రస్ట్, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్, ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్, ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్, ఎస్విబిసి ట్రస్ట్, బాలాజీ ఆరోగ్యవరప్రసాదిని స్కీమ్లకు దాతలు విరాళాలు చెల్లించి సౌకర్యాలను పొందవచ్చని టిటిడి తెలిపింది. దాతలు టిటిడి వెబ్సైట్ “డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. టిటిదేవస్థానమ్స్. ఎపి.జివొవి, ఇన్”లో ఆన్లైన్ ద్వారా విరాళాలు చెల్లించవచ్చు. ఆన్లైన్లోలో దాతలు విరాళా లను ఇఒ టిటిడి పేరున డిడి, చెక్ ను తిరుమలలోని దాతల విభాగంలో (డోనార్సెల్) అందజేయవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: