తిరుమల వెళ్లే భక్తుల సంఖ్య రోజూవారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం, టీటీడీ(TTD), TUDA(Tirupati Urban Development Authority) కలిసి సౌకర్యాల విస్తరణపై దృష్టి పెట్టాయి. భక్తుల రద్దీ పెరుగుతున్న కొద్దీ రవాణా, రోడ్లపై ఒత్తిడి పెరగడంతో, అలిపిరిని ప్రధాన కేంద్రంగా చేసుకుని ప్రత్యేక బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రణాళికలు కూడా రూపొందుతున్నాయి.
News Telugu: AP: చంద్రబాబుది ఎప్పుడూ కార్పొరేట్ పక్షపాతమే: బొత్స

తిరుమల–తిరుపతి ట్రాఫిక్ తగ్గించేందుకు 90 కిమీ ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన
భక్తుల రాకపోకలకు ఆటంకం కలగకుండా రవాణా వ్యవస్థను మెరుగుపర్చే దిశగా TUDA ఇప్పుడు కీలక చర్యలు ప్రారంభించింది. తిరుపతికి ఔటర్ రింగ్ రోడ్ (ORR) నిర్మించేందుకు ప్రత్యేక ప్రతిపాదనను సిద్ధం చేసి, దీనిపై అధికారిక సర్వే ప్రారంభించారు. తిరుమల–తిరుపతి ప్రాంతాల్లో పెరుగుతున్న వాహన రద్దీ భక్తులకు ఇబ్బందిగా మారుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడానికి ఇది ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
రద్దీ సమస్యకు ORR రూపంలో పరిష్కారం
ప్రతిపాదిత ORR తిరుపతి గ్రామీణం, చంద్రగిరి, రామచంద్రాపురం, రేణిగుంట, వడమాలపేట మండలాలను కలుపుతూ నిర్మించనున్నారు. ‘కొత్త మాస్టర్ ప్లాన్ రోడ్డు’ పేరుతో నిర్మించబోయే ఈ రింగ్ రోడ్డు సుమారు 90 కిలోమీటర్ల పరిధిలో ఉండనుంది. గతంలో సీఎం చంద్రబాబు ప్రతిపాదించిన ‘వైకుంఠమాల’ ORR ప్రణాళికను మళ్లీ పరిశీలించి, ప్రభుత్వ భూములను అత్యధికంగా వినియోగిస్తూ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు తుడా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ రింగ్ రోడ్ పూర్తిగా అందుబాటులోకి వస్తే, తిరుమలకు వచ్చే వాహనాలను నేరుగా బయటికి మళ్లించే అవకాశం ఉండడంతో నగరంలో ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గే అవకాశం ఉంది. దీని వల్ల తిరుపతి భవిష్యత్తు రవాణా అవసరాలు కూడా సులభంగా నెరవేరనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: