తిరుపతి (చంద్రగిరి): తిరుపతి(TTD) జిల్లాలో చంద్రగిరి పోలీసులు తమ సమర్థత, చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ 32 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు(SP L. Subbaraidu) ఈ పట్టివేతలో కృషి చేసిన అధికారులను అభినందిస్తూ రివార్డులను ప్రకటించారు. పనపాకం పంచాయతీ, తువ్వచేనుపల్లి జాతీయ రహదారి వద్ద ప్రత్యేక తనిఖీల్లో ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Read also: Vijayawada: యాభై కిలోమీటర్లకో పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వ కార్యాచరణ

డాగ్‌స్క్వాడ్‌తో రహస్య అరల గుర్తింపు
తమిళనాడుకు చెందిన పొన్నుస్వామి సెల్వరాజ్(Ponnuswamy Selvaraj) (43) ఒరిస్సా నుంచి గంజాయిని తన కారులో అత్యంత పకడ్బందీగా దాచుకుని తరలిస్తున్నాడు. పోలీసుల(police) సాధారణ తనిఖీలో ఈ గంజాయి బయటపడలేదు. అయితే, తమకు లభించిన విశ్వసనీయ సమాచారంతో సంతృప్తి చెందని పోలీసులు, మరోమారు పోలీస్ డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేయించారు. ఈ క్రమంలో, కారు డాష్ బోర్డ్, గేర్‌బాక్స్, టైర్ స్టెప్ భాగాలలో దాచిపెట్టిన గంజాయిని జాగిలం కనిపెట్టింది. తనిఖీ చేయగా, 32.730 కిలోల (27 ప్యాకెట్లు) గంజాయి బయటపడింది.
నిందితుల అరెస్ట్, ఎస్పీ హెచ్చరిక
కారు నడుపుతున్న పొన్నుస్వామి సెల్వరాజ్‌తో పాటు, శివగంగై జిల్లాకు చెందిన కలనివాసల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, గంజాయితో పాటు 2 మొబైల్స్‌ను సీజ్ చేశారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, వినియోగం, విక్రయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్పీ తెలిపారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాలకు మత్తు పదార్థాల సరఫరాకు పాల్పడితే తీవ్రమైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: