తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు గత ఏడాది రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. టీటీడీ(TTD) వెల్లడించిన వివరాల ప్రకారం, 2024లో 12.15 కోట్ల లడ్డూలు విక్రయమవగా, 2025లో ఈ సంఖ్య 13.52 కోట్లకు చేరింది. ఇది గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని అత్యధిక అమ్మకాలుగా గుర్తించారు.
Read Also: AP: ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

భక్తుల రద్దీ అధికంగా ఉన్న రోజుల్లో లడ్డూ విక్రయాలు భారీగా జరిగాయి. ముఖ్యంగా డిసెంబర్ 27వ తేదీన ఒక్కరోజే 5.13 లక్షల లడ్డూ ప్రసాదాలు విక్రయమయ్యాయి. ఇది తిరుమలలో భక్తుల విశ్వాసం ఎంత బలంగా ఉందో చాటిచెప్పే అంశంగా టీటీడీ(Tirumala Tirupati Devasthanams) అధికారులు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చి స్వామివారి దర్శనంతో పాటు ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా లడ్డూ తయారీ, సరఫరా వ్యవస్థలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని టీటీడీ తెలిపింది.
ఈ రికార్డు విక్రయాలు శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై భక్తుల అపారమైన నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: