తిరుమల : వడ్డికాసుల శ్రీవేంకటేశ్వరస్వామికి (Sri Venkateswara Swamy) వరుసగా జూలై నెలలోనూ కానుకల రూపంలో హుండీ ఆదాయం వందకోట్లరూపాయలు పైగానే రికార్డు చేకూరింది. సుమారు 130 కోట్ల రూపాయల ఆదాయం నమోదైంది. జూలైనెలకు సంబంధించి గత 31రోజుల హుంఢీ ఆదాయం 129.48కోట్లు దాటడం విశేషం. గత ఏడునెలల్లో జూలైలోనే అధికంగా చేకూరింది. గత ఏడాది జులైలో 125కోట్ల రూపాయలు హుంఢీ ద్వారా ఆదాయం రాగా,2023 జూలైలో 139.45కోట్లు రూపాయలు ఆదాయం చేకూరింది. దేశవిదేశాల్లోని భక్తులు తమ ఇష్టదైవమ్ శ్రీవేంకటేశ్వరస్వామి దర్శ నానికి తిరుమలకు భారీగా తరలి వస్తున్నారు. తమ మొక్కుబడుల్లో భాగంగా కానుకల రూపంలో హుండీకి నగదు, నగలు సమర్పించుకోవడం కనిపిస్తోంది. భక్తుల రద్దీతో బాటు మొక్కు బడుల రూపంలో కానుకలు హుండీకి భారీగానే చేరాయి.

ప్రతిరోజూ సరాసరి 3.50-4కోట్లురూపాయలు వరకు హుండీ ఆదాయం (Hundi income) లభించింది. వరుసగా సరాసరి రోజుకు 4కోట్లరూపాయలు దాటిన రోజులే ఎక్కువ. సహజంగా వేసవిసెలవులు ఏప్రిల్, మే నెలలో, ఆ తరువాత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో హుండీ ఆదాయం 130కోట్లు రూపాయలవరకు నమోదవుతుంది. ఇక భక్తుల విషయానికి వస్తే గత నెలలో సరాసరి 23.63లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.
VISIT TO : Hindi.vaartha.com
READ MORE :