TTD: కూలిన భారీ చెట్టు, కారు ధ్వంసం – ఎడతెరపిలేకుండా కురుస్తున్న వాన తిరుమల :తిరుమల (Tirumala) పై తీవ్రంగా చూపుతోంది. మంగళవారం ఉదయం నుండి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తిరుమల బాలాజీనగర్లో భారీ వృక్షం కూలింది. ఆ సమయంలో దాని క్రింద పార్కుచేసిన కారుపై పడటంతో ధ్వంసమైంది. అదే ప్రాంతంలో భక్తులు, స్థానికులు కూడా లేకపోవడంతో పెద్దప్రమాదం తప్పింది. కూలిన చెట్టును టిటిడి అటవీశాఖ అధికారులు గంటలోపే తోలగించారు. ఇటీవల వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల జలమయంగా మారింది. కొండపై ఐదు ప్రధాన జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. మంగళవారం ఉదయం నుండి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఓ వైపు ఎడతెరపిలేని వర్షం మరోవైపు విపరీతమైన చలితో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా కురుస్తున్న వానలతో వాతావరణం మారి చలి తీవ్రత పెరిగింది.
Read also: TTD: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు యధాతథం

TTD: తిరుమలపై ‘మొంథా” తుఫాన్ ప్రభావం
TTD: దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు చలికి వణుకుతున్నారు. మంగళవారం ఉదయం కూడా భారీ వర్షం కురవడంతో భక్తులు ఆలయం లోపలకు శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపలకు వర్షంలో తడిసి లడ్డూవితరణశాలకు చేరుకోవాల్సి వస్తోంది. భారీ వర్షాల కారణంగా తిరుమల ఘాట్లోడ్లలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం వుందని, వాహనదారులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని టిటిడి విజిలెన్స్ హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాలు పడుతుండటంతో ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు తలదాచుకునేందుకు షెడ్లవద్దకు పరుగులు తీస్తున్నారు. భారీ వర్షాలకు భక్తులు జాగ్రత్తలు పాటించాలని టిటిడి విజప్తి చేస్తోంది. వర్షం తగ్గుముఖం పట్టేవరకు భక్తులు తిరుమలలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరుతున్నారు. తిరుమల నుండి తిరుపతికి వెళ్ళే, తిరుగు ప్రయాణమయ్యే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు కొండల్లోంచి జలపాతాలు జోరున పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి. తిరుమలకొండలను తెల్లటిపొగమంచు కమ్మేసి ఆహ్లాదకరంగా ఊటీని తలపింపజేస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: