తిరుపతి: కల్తీనెయ్యి వచ్చినా కేసు ఎందుకు నమోదు చేయలేదు? మాజీ చైర్మన్ సుబ్బారెడ్డిని ప్రశ్నించిన సిట్ తిరుమల (TIRUMALA) లో లడ్డూల తయారీకి 2020-24 మద్యకాలంలో టెండర్లు ఏ ప్రాతిపదికన పిలిచారు, టెండర్లలో పాల్గోన్న డెయిరీ యాజయాన్యం, కాంట్రాక్టర్లు ఎవరు అనే కోణంలో టిటిడి మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిబిఐ సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఇప్పటికే నిందితుల రిమాండ్ రిపోర్టు ఆధారాలతో గురువారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లోని నివాసంలో సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించడం విశేషం. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీనెయ్యి వినియోగించారనే సంచలనంపై సిట్ చేపట్టిన లోతైన విచారణలో క్లైమాక్స్ మాజీ ఛైర్మన్ వైవిని ప్రశ్నించారు.
Read also: Haryana Ex Haryana: దివిసీమ ఘటన జీవితాన్నే మార్చేసింది:బండారు దత్తాత్రేయ

How were tenders allocated? SIT questions Subba Reddy
ఆరుగంటలకు పైగా విచారణ
ఏ మేరకు నిబంధనలు పాటించి నెయ్యి సరఫరాకు టెండర్లు పిలిచారు, టెండర్లలో పాల్గొన్న ఐదుసంస్థలు, కాంట్రాక్టర్లతో ఎలా పరిచయాలు, ఆ తరువాత కల్తీ నెయ్యి వచ్చిందని తెలిసినా ఎందుకు కేసు నమోదు చేయలేదు అనే కోణంలో ప్రశ్నలు వేసి సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ఇప్పటికే సిట్ బృందం టిటిడి మార్కెటింగ్, కొనుగోలు విభాగం, పోటు విభాగం నుండి సేకరించిన సమాచారంతో బాటు వైవి పిఎ చిన్న అప్పన్న నుండి రాబట్టిన కీలక ఆధారాలతో ఆరుగంటలకు పైగా విచారణ చేశారు. కొన్ని వివరాలు సేకరించారనేది తెలిసింది.
సుబ్బారెడ్డి సాధారణ సమాధానాలు ఇచ్చారనేది
చిన్న అప్పన్నను టిటిడి వ్యవహారాల్లో ఎందుకు కలగజేసుకోమ్మన్నారు, దాని వెనుక లబ్ధి ఏపాటిది అనే విచారణ చేయడంతో సుబ్బారెడ్డి సాధారణ సమాధానాలు ఇచ్చారనేది తెలిసింది. లడ్డూ ప్రసాదాల తయారీకి ఎంత కాలంగా కల్తీనెయ్యి వినియోగించారు? అసలు నెయ్యి సరఫరా చేయాల్సిన సంస్థలు, కాంట్రాక్టర్ల స్థానంలో మరొకరు సరఫరా చేశారనేది తెలిసినా ఎందుకు ఉదాసీనంగా ఉన్నారనే ప్రశ్నలకు అధికారులు పర్యవేక్షించే వాటిపై బోర్డు కలగజేసుకోలేదనేది ట్విస్ట్ వచ్చిందనేది తెలుస్తోంది. మౌనంగా కల్తీనెయ్యినే లడ్డులకు వినియోగించాల్సిన అవసరం ఏముందనేది విచారణ చేపట్టినట్లు సమాచారం. మరీ ఇప్పుడు సిట్ తీసుకోబోయే చర్యలు ఏంటనేది ఉత్కంఠగా మారింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :