మారనున్న గదుల అద్దె సుంకం తిరుమల: కేంద్రప్రభుత్వం తీసుకున్న జిఎస్టి GST స్లాబ్స్ తగ్గింపు అమలులోకి రావడంతో దాని ప్రభావం ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం వసతి కల్పన విభాగంలో కూడా భక్తులపై అద్దెలు సుంకం భారం తగ్గనుంది. ఇప్పటికే ఆద్దె గదుల విషయంలో తడిసి మోపెడవుతున్న భారం భక్తులపై పడకుండా తగ్గించాలని టిటిడి TTD నిర్ణయం తీసుకుంది. దీనివల్ల భక్తులకు కేటాయి స్తున్న గదుల అద్దె సుంకం తగ్గనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే టిటిడి ఇఒ అనిల్ కుమార్ సింఘాల్ గత శుక్రవారం మీడియాతో ఇష్టా గోష్టిగా మాట్లాడుతూ వెల్లడించారు. ఏడుకొండల వేంకటేశ్వరస్వామి దర్శనంకోసం దేశవిదేశాల నుండి తిరుమలకు రోజువారీగా లక్షమంది వరకు భక్తులు వస్తున్నారు. కొండపై ఉన్న పరిస్థితుల్లో 30వేలమంది నుండి 40 వేలమంది వరకు భక్తులకు మాత్రమే వసతి సౌకర్యం కల్పించే అవకాశం ఉంది. ఇంకా చాలావరకు కాటేజీలు, విశ్రాంతి గృహాలు ఆధు నీకరణ, పునఃనిర్మాణం పనులు సాగుతున్నాయి.
Suicide Attempt : పెనుకొండలో మహిళా హోం గార్డు ఆత్మహత్యాయత్నం కలకలం

TTD GST
ఇప్పటి పరిస్థితుల్లో తిరుమలలో 7,300 వరకు గదులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో పద్మా వతి విచారణ కార్యాలయం పరిధిలో ప్రముఖులు, ముఖ్యులు బసచేసే విధంగా 750గదులు, ముఖ్యులతోబాటు సామాన్యభక్తులు బసచేసే కాటేజీ, విశ్రాంతి గదులు ఎంబిసి MBC పరిధిలో 683గదులు, సిఆర్డిఓ, టిబి కౌంటర్ల పరిధిలో ఆరువేల వరకు గదులు ఉన్నాయి. సీఆర్. ఎంబిసి విచారణ కార్యాలయాల పరిధిలో 50 రూపాయల అద్దె గదుల నుండి వెయ్యిరూ పాయలు, 1,800రూపాయల వరకు అద్దెగదులు కేటాయింపు జరుగుతుంది. వీటన్నిటిపై గత మూడేళ్ళుగా భక్తులకు ఐదుశాతం జిఎస్టి భారం చెల్లించాల్సి వచ్చింది. తాజాగా కేంద్రం జిఎస్టి కొన్ని రకాల వస్తువులు, ప్రజలు వినియోగించుకునే పలు రకాల వాటిపై తగ్గించడంతో ఆ ప్రభావం తిరుమల, తిరుపతిలో టిటిడి వసతి గృహాల గదుల అద్దెలపై చూపుతుంది.
GST తగ్గిస్తున్నట్లు
గదుల కోసం వసూలు చేస్తున్న అద్దెలపైన జిఎస్టిని GST తగ్గిస్తున్నట్లు ఇఒ సింఘాల్ కీలక ప్రకటన చేయడంతో సామాన్యభక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అద్దెగ దులపై పన్నులను తగ్గిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. దీనివల్ల భక్తులు చెల్లించే గదుల అద్దెలు తగ్గాయి. ఇదే సమయంలో భక్తుల నుండి ఎక్కువగా వస్తున్న విజ్ఞప్తుల మేరకు సాధ్యమైనంత వరకు నిరీక్షణ లేకుండా కేటాయించేలా చూడనున్నారు. వసతి కల్పనవిభాగం ఇప్పటికే రెండువందల శాతం గదుల ఆక్యుపెన్సీ రేటును కూడా సాధించింది. ఇదేగాక టిటిడి తిరుమలలో మూడునాలుగు విశ్రాంతి గృహాలు, కాటేజీలు ఆధునీకరించే పనులు మొదలుపెట్టింది. సామాన్యభక్తులకు వసతి కల్పించేందుకు వీలుగా కేంద్రీయ విచారణ కార్యాల యం(సిఆర్)ను ఆధునీకరించే పనులు కూడా చేపట్టనుంది. 50రూపాయలు, 100 రూపాయలు అద్దెగదులు పూర్తిగా సామాన్యభక్తులకు అన్ని సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుమలలో భక్తులపై జీఎస్టీ భారం తగ్గిందని ఎందుకు చెబుతున్నారు?
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులను తగ్గించడంతో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వసతి విభాగం గదుల అద్దెలపై ఉన్న జీఎస్టీ భారం కూడా తగ్గనుంది.
ఈ మార్పు వల్ల భక్తులకు ఎలాంటి లాభం కలుగుతుంది?
గదుల అద్దెలపై జీఎస్టీ తగ్గడంతో భక్తులు చెల్లించాల్సిన మొత్తంలో తగ్గుదల వస్తుంది. అంటే గదుల అద్దెలు మరింత చవకగా మారనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: