हिन्दी | Epaper
పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

TTD: గోవిందుని ఆలయంలో మహాద్వారం రగడ

Ramya
TTD: గోవిందుని ఆలయంలో మహాద్వారం రగడ

TTD: వేంకటేశ్వరస్వామిని ఎంతో భక్తితో విశ్వాసంతో సామాన్య భక్తులు నుండి ప్రముఖుల వరకు దర్శనం చేసుకుని ఆలయం వెలుపలకు ప్రశాంతమనస్సుతో రావడం పరిపాటి. మనస్సంతా గోవిందనామంతోనే పరితపిస్తుంటుంది. అలాంటిది కొందరు ప్రజాప్రతినిధులు మొక్కుబడిగా దేవదేవుడిని దర్శనం చేసుకున్నామా, తమ పలుకుబడి ఉపయోగించి ఆర్భాటంగా ఆలయ ఉద్యోగులపై పెత్తనం చలాయించామా? అనే రీతిలో వ్యవహరిస్తుండటం భక్తిభావాన్ని దెబ్బ తీసేలా మారింది. ఇలాంటి ఘటనలు వరుసగా తరచూ చోటుచేసు కొంటుండటంతో క్యూలైన్లో ఉన్న భక్తులేగాక ఎంతో భక్తిభావంతో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తుండటం ఇప్పుడు రచ్చచర్చగా మారింది.

TTD: గోవిందుని ఆలయంలో 'మహాద్వారం' రగడ
TTD: గోవిందుని ఆలయంలో ‘మహాద్వారం’ రగడ

విఐపిల ప్రత్యేక దర్శన మార్గం మహాద్వారం నుంచి ప్రారంభమై, ఆలయం లోపల ప్రత్యేక రీతిలో సాగుతుంది

TTD: సాధారణంగా ప్రముఖులు తమతోబాటు వచ్చే విఐపిలను వెంకన్న దర్శనానికి వెంటబెట్టుకుని వైకుంఠమ్ 1 క్యూకాంప్లెక్స్ నుండి ఆలయంలోనికి వస్తుంటారు. ఉదయం వేళ విఐపి బ్రేక్ దర్శనంలో ప్రజాప్రతినిదులు, వారి సిఫార్సు లేఖలపై వచ్చేభక్తులు, రాజ్యాంగ పరిధిలోని ప్రముఖులు వస్తుంటారు. వీరంతా ఆలయంలో మహద్వారం నుండి ధ్వజస్తంభం దాటుకుని బంగారు వాకిలి మీదుగా ఆనంద నిలయంలోనికి చేరుకుంటారు. మొదటిగడప కులశేఖరపడి వరకు వెళ్ళి మరీ ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని దగ్గరగా నిలబడి దర్శనం చేసుకుని ఆశీస్సులందుకుంటారు. వీరంతా తిరిగి ఆలయంలోపల నుండి వెలుపలకు రావడానికి మార్గం ఉంది. ఈ మార్గంలోనే వెలుపలకు రావాలి.

ఆలయ భద్రతా వ్యవస్థపై ప్రజాప్రతినిధుల తీరుతో సందేహాలు

అయితే కొందరు ప్రజాప్రతినిధులు తమ పలుగు చూపాలనే తపనతో వెలుపల గడప నుండి మహద్వారం గేట్ (Mahadwaram Gate) మీదుగా బయటకు రావడానికి సుముఖత చూపుతుంటారు. అయితే తిరుమల (Tirumala) ఆలయంలో మహద్వారం గేట్ అత్యంత భద్రతతో కూడుకున్నది. ఈ గేట్నుండి వెలుపలకు ఆలయంలోపల విధులు నిర్వహించే అర్చకులు, టిటిడి పాలకమండలి చైర్మన్, ఇఒ, అదనపు ఇఒ, జెఇఒ, సివిఎస్, ఆలయ ఏవిఎస్,ప్రధాన అర్చకలు, అర్చ కులకు మాత్రమే వెసలుబాటు ఉంది. ఇంకా ఆలయంలోపల భక్తుల రద్దీ ఎక్కువైన సమ యంలో భక్తులు సులభంగా వెలుపలకు రావ డానికి మహద్వారం గేట్లను తెరచి పంపుతుంటారు. ఆ సమయంలో కూడా భక్తులు ఎవరూ ఈ గేట్లో లోపలకు వెళ్ళకుండా చూడాల్సిన బాధ్యత అక్కడి సిబ్బందిపై ఉం టుంది. అలాంటిది ఇటీవల కాలంలో తరచూ కొందరు ప్రజాప్రతినిధులు, బోర్డు సభ్యులు తమ ప్రాపకం కోసం మహద్వారం గేట్నుండి వెలుపలకు రావడానికి అక్కడి సిబ్బందితో దిగుతున్నారు.

మర్యాదపూర్వక సూచనలకూ లొంగని నేతలు.. టిటిడి ఉద్యోగులపై ఆగ్రహావేశాలు

నిబంధనలకు విరుద్దంగా గేట్ తెరవలేమని, వెలుపల కెళ్ళే మార్గం నుండి వెళ్ళాలని మర్యాదపూర్వకంగా సూచించినా అందుకు తిరస్కరించి దూషణల పర్వం, బెదిరింపు చేయడం జరుగుతోంది. బుధవారం ఉదయం అధికారపార్టీకి చెందిన వెంకటగిరి ఎమ్మెల్యే కె.రామకృష్ణ తన అనుచరులతో కలసి విఐపి బ్రేక్లో (VIP break) ఆలయం నుండి వెలుప లకు వచ్చేందుకు మహద్వారం ముందు గేట్స్తో యాలని కోరాడు. అందుకు అక్కడి సిబ్బంది నిరాకరించడంతో ఆగ్రహం వెలిబుచ్చారు. ఇటీవలే జిడినెల్లూరు ఎమ్మెల్యే థామస్, గతంలో కర్నాటకకు చెందిన ఓ టిటిడి బోర్డు సభ్యుడు కూడా ఇదే రీతిలో టిటిడి ఉద్యో గులపై విరుచుకుపడ్డారు. తరచూ ఆలయం మహద్వారం ముందు గేట్ టిటిడి ఉద్యోగులకు అభద్రతను చేకూరుస్తోంది. టిటిడి ఉన్నతాధి కారులు, విజిలెన్స్ ఉన్నతాధికారులు ఈ సున్నితమైన విషయంపై స్పష్టమైన ఆదేశాలిస్తే అటు ప్రజాప్రతినిధులు ఇటు ఉద్యోగులకు ఇబ్బందులు ఉండవనేది టిటిడి వర్గాల వాదన.

తిరుమల చరిత్ర?

ద్వాపర యుగంలో, ఆదిశేషుడు వాయుతో పోటీలో ఓడిపోయిన తర్వాత శేషాచలం కొండలుగా భూమిపై నివసించాడు . పురాణాల ప్రకారం తిరుమలను ఆదివరాహ క్షేత్రంగా పరిగణిస్తారు. హిరణ్యాక్షుడిని సంహరించిన తరువాత, ఆదివరాహుడు ఈ కొండపై నివసించాడు. వెంకటాచల మహత్యం తిరుమల ఆలయంపై విస్తృతంగా ఆమోదించబడిన పురాణం.

తిరుపతి బాలాజీ భార్య ఎవరు?

అతని ఇద్దరు భార్యలు, లక్ష్మీదేవి మరియు యువరాణి పద్మావతి కూడా తమ భర్త పట్ల తమ అంకితభావాన్ని వ్యక్తపరచడానికి మరియు అతనితో శాశ్వతంగా ఉండటానికి రాతి విగ్రహాలుగా మారారు. లక్ష్మీదేవి అతని ఛాతీకి ఎడమ వైపున ఉండగా, పద్మావతి దేవి అతని కుడి వైపున ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: AP Rains: ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్.. వాతావరణ శాఖ హెచ్చరిక

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870