తిరుమల(TTD) అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి(Sri Venkateswara Swamy)దర్శనార్థం రోజుకు లక్షమందివరకు వస్తున్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పన వెనుక భక్తుల అభిప్రాయాలతోనే సాధ్యమవుతోందనేది టిటిడి అధికారుల మాట. ఇదే నిజంచేస్తూ ఇటీవల ముగిసిన తొమ్మిదిరోజుల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం వెనుక భక్తులు ఇచ్చిన సూచనలతోనేననేది అధికారుల వాదన కూడా. ఇకపై రానున్న రోజుల్లోనూ లక్షమందికి పైగా భక్తులు వచ్చినా సాఫీగా, ప్రశాంతంగా సకల సౌకర్యాలు సంతృప్తికరంగా కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణ అమలుచేసేలా చూస్తున్నారు. బ్రహ్మోత్స వాల్లో రోజువారీగా లక్షమంది వరకు భక్తులు మాఢవీధుల్లో స్వామివారి వాహనసేవలు వీక్షించగా 70వేలమంది వరకు భక్తులు మూలవిరాట్టును దర్శించుకుని సంతృప్తి చెందడం టిటిడి పనితీరుకు నిదర్శనం.
Read Also: India:భవిష్యత్తులో భారతదేశం అంతరిక్షంలో నంబర్ వన్గా ఉండాలి

భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న వేళ ఏరోజుకారోజు పరిస్థితులకు అనుగుణంగా తిరుమల
తిరుపతిదేవస్థానం(TTD) సామాన్యభక్తులకు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనంతోబాటు వసతి కల్పనలో మరింత మెరుగైన మార్పులు తీసుకురావడానికి అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు. ఇందుకుసాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. తిరుమలలో జరిగే పొరబాట్లు, తప్పులు, వసతి సౌకర్యం ఎలా. ఉంది… స్వామివారి దర్శనం బాగా జరిగిండా అనే ప్రశ్నలతో భక్తులనుండి సమాధానాలు తీసుకుంటున్నారు. ఈ ఫీడ్బ్యాక్ను టిటిడి ఐటి విభాగానికి చేరవేస్తే ఏదేని తీవ్ర సమస్యలు ఉంటే అక్కడ నుండి టిటిడి ఇఒ అనిల్కుమార్సంఘార్కు, అదనపు ఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి, సివిఎస్, మురళీకృష్ణకు అందుతుంది. క్షేత్రస్థాయిలో ఇఒ, అదనపు ఇఒ చేపట్టాల్సిన మార్పులు, మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఇదీ.
దోహదపడుతుంది. ఎలాంటి ప్లానింగ్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చిన భక్తులు తొలుత వసతి కోసం, ఆ తరువాత స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో నిరీక్షించే సమయంలో ఎదురయ్యే సమస్యలపై సూచనలు, అభిప్రాయాలు వస్తున్నాయి. భక్తులు నిర్మోహమాటంగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఐవిఆర్ఎస్, వాట్సాప్(9399399399), ఈ సర్వే శ్రీవారిసేవకులద్వారా అభిప్రాయ సేకరణ తీసుకోవడమేగాక 16అంశాలపై భక్తులు తమ అభిప్రాయాలు చెప్పడానికి వీలుగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ యాప్ను అందుబాటులో ఉంది. ఈ కోడ్యప్ను తిరుమలకొండపై ప్రధాన కూడళ్ళలో, వసతికల్పన విచారణ కార్యాలయాల వద్ద ఏర్పాటుచేశారు. భక్తులు ఈ విధానంలో అభిప్రాయాలు, ఫిర్యాదులు, సలహాలు ఇస్తే టిటిడి ఉద్యోగులు, అధికారుల్లో బాధ్యతను పెంపొందించే విధంగా మారింది. రోజువారీగా 80వేలమంది వరకు యాత్రికులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వారాంతం శని, ఆదివారాల్లో ఈ రద్దీ మరింతగా పెరిగి 1.20లక్షలమంది వరకు చేరుకుంటున్నారు.. సాధారణ రోజుల్లో కూడా తిరమలేశుని దర్శనానికి పదిగంటలు సమయం వేచివుండాల్సిన పరిస్థితి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: