సౌకర్యవంతంగా క్యూలైన్లు ఏర్పాటు
టిటిడి ఇఒ,అదనపు ఇఒ
తిరుమల: తిరుమలలో ఆఫ్లైన్లోరోజువారీగా జారీచేసే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనాల టిక్కెట్ల సమాచారాన్ని డిజిటల్ స్క్రీన్ల (Digital screens) ద్వారా తెలిసేలా చర్యలు తీసుకోవాలని టిటిడి (TTD) ఇఒ శ్యామలరావు, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి ఆదేశించారు. శ్రీవాణి టిక్కెట్లు జారీచేసే నూతన కేంద్రంలో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా క్యూలైన్లు ఏర్పాటుచేయాలని చెప్పారు. ఈ కౌంటర్ల వద్ద ఉదయం నుండి భక్తులు వేచి ఉంటారు కావున ఇబ్బంది పడకుండా టీ, కాఫీ, పాలు, తాగునీరు, అల్పాహారం పంపిణీ చేయాలని సూచించారు.

తిరుమలలో శ్రీవాణి టిక్కెట్లు జారీచేసే నూతన కార్యాలయం కౌంటర్లను బుధవారం మధ్యాహ్నం టిటిడి (TTD) ఇఒ శ్యామలరావు (EO Shyamala Rao), అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి అధికారులతో కలసి తనిఖీ చేశారు. ఇక్కడ అన్ని మౌళిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 22వతేదీ నుండి ఈ కౌంటర్లు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు. అక్కడ నుండి ఏఎన్సి, హెచ్విసి విచారణ కార్యాలయాల వద్ద జరుగుతున్న ఆధునీకరణ పనులను తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవి, డిప్యూటీ ఇఒలు భాస్కర్, సోమన్నారాయణ, డిఇ చంద్రశేఖర్, సుమ్రణ్యం, ఆరోగ్య అధికారి డాక్టర్ మధుసూదన్ పాల్గోన్నారు .
డిజిటల్ స్క్రీన్ల ద్వారా టిక్కెట్ సమాచారం ఇవ్వడం వల్ల కలిగే లాభం ఏమిటి?
డిజిటల్ స్క్రీన్ల ద్వారా టిక్కెట్ల సమాచారం అందించడం వల్ల భక్తులకు స్పష్టత, పారదర్శకత, మరియు వేచి చూసే సమయంలో సమాచారం తెలుసుకునే సౌలభ్యం లభిస్తుంది. ఇది భక్తుల సౌకర్యార్థం తీసుకున్న మెరుగైన నిర్ణయం.
TTD ఈ డిజిటల్ స్క్రీన్లను ఎక్కడ ఏర్పాటు చేసింది?
TTD డిజిటల్ స్క్రీన్లను ముఖ్యంగా తిరుపతి, ఆలయ ప్రాంగణం, టిక్కెట్ కౌంటర్లు, రైల్వే స్టేషన్, తదితర ప్రదేశాల్లో ఏర్పాటు చేసింది, తద్వారా భక్తులకు ఏ సమయంలో ఏ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Tirumala: శ్రీరంగం నుండి తిరుమలేశునికి పట్టువస్త్రాలు