కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటున్నది. వైఎస్ జగన్ హయాంలో పలు రంగాల్లో అవినీతి జరిగినట్లుగా పలు ఆరోపణలు వస్తున్న తరుణంలో చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా టీటీడీ పరకామణి కేసులో ఊహించని మలుపు తిరిగింది.
టీటీడీ (TTD) మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ (Satish Kumar) మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. సతీష్ కుమార్ ను చంపేసినట్లు ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైంది. పరకామణి కేసులో ప్రత్యర్థులే ప్రాణాలు తీశారని సతీష్ కుమార్ సోదరుడు ఫిర్యాదు చేశారు. నిన్న తాడిపత్రి సమీపంలో రైలు పట్టాలపై సతీష్ కుమార్ మృతదేహం దొరికింది. తలపై దాడి, శరీరంలో ఎముకలు విరిగినట్లు పోస్ట్మార్టం రిపోర్ట్ లో వెల్లడైంది. రైల్లోనే కొట్టి కిందకు తోసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: Parenting Tips: ఎగ్ షెల్ పేరెంటింగ్ అంటే ఏమిటి?

తోటి ప్రయాణీకులపై పోలీసులు ఆరా..
సతీష్ మృతిపై కేసునమోదు చేసిన గుత్తి రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. సతీష్ ప్రయాణించిన రైలులో తోటి ప్రయాణికులపై పోలీసులు ఆరా తీశారు. ప్రయాణికుల లిస్టును పోలీసులు పరిశీలిస్తున్నారు. పరాకాణి చోరీ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సతీష్ కుమార్.. రెండోసారి సీఐడీ డీజీ ముందు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయన శవమై తేలారు. ప్రస్తుతం గుంతకల్లు రైలులో సీఐగా ఉన్న సతీష్ కుమూర్ గతంలో టీటీడీ ఏవీఎస్ వోగా పనిచేశారు. పరకామణి కేసులో ఈనెల 6న సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. 2023లో ఈ చోరీనిగుర్తించి, ఫిర్యాదు చేసింది కూడా సతీష్ కుమారే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: