TTD: తిరుమల పరకామణి కేసు హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నేడు ధర్మాసనం ముందుకు సిఐడి వివరాలు తిరుమల : మూడు సంవత్సరాల క్రిందట తిరుమల పరకామణిలో వెలుగు చూసిన 920 అమెరికన్ డాలర్ల చోరీ కేసు ఉదంతంలో లోక్అదాలత్ ద్వారా మధ్యవర్తిత్వం జరిపి రాజీచేయడం వెనుక ఉన్న మతలబుపై హైకోర్టు ధర్మాసనం పునర్విచారణకు ఆదేశిస్తే ఏం జరగనుందనేది అటు పోలీసుశాఖలో ఇటు టిటిడి వర్గాల్లో సంచలనంగా మారింది. నిందితుడుగా పట్టుబడిన సివి రవికుమార్ రెండు దశాబ్దాల పాటు పరకామణి విధుల్లో ఉంటూ ఏకంగా 140 కోట్ల రూపాయలు మేరకు ఆక్రమాస్తులు కూడగట్టారనేది ప్రధాన ఆరోపణలు. ఈ ఆస్తుల్లో కేవలం 14 కోట్ల రూపాయలు మాత్రమే అతని పేరున, భార్య పేరున ఉన్నవాటిని వడ్డీకాసుల వేంకటేశ్వరస్వామికి విరాళంగా ఇచ్చారనేది అప్పటి టిటిడి (TTD) పాలకమండలి పెద్దలు బోర్డులు తీర్మానించిన విషయం. అయితే క్రిమినల్ చర్యగా భావించే ఈ కేసులో చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అప్పటి టిటిడి బోర్డు పెద్దలు, కొందరు పోలీస్ అధికారులు లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదర్చడం దేవుని సొమ్ముకు శఠగోపం పెట్టేశారా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
Read also: Guntur crime: పరువు హత్య కేసులో ఏడుగురి అరెస్ట్ చేసిన పోలీసులు

TTD
ఈ వ్యవహారంపై 2023లోనే అప్పట్లోనే పెద్ద దుమారం రేపినా పట్టించుకోలేదు. గత కొంతకాలంగా ఈ పాత కేసుపై దుమారం రేగడం, ఏకంగా ప్రస్తుత టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆధారాలతో సిఎం చంద్రబాబుకు (chandrababu) విన్నవించారు. శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడంతో విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం తదుపరి ఈ కేసుకు సంబంధించి 2023లో నమోదైన ఎఫ్ఆర్, సిడిఫైళ్ళు, దర్యాప్తు రికార్డులు, సీని “పుటేజీలు సమర్పించాలని ఆదేశించింది. పోలీసు వర్గాలు జాప్యం చేయడంపై ఇటీవల హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. తదనంతరం పరిణామాలతో సిఐడి డిజి రవిశంకర్ అయ్యన్నార్ మంగళవారం తిరుమలకు చేరుకుని పరకామణి భవనాన్ని పరిశీలించడం, పరకామణి లెక్కింపు, భద్రత, సిసిటివి నిఘా వంటివి కీలకంగా గమనించారు. తిరుమల వన్డేన్ పోలీస్టేషన్లో 2023 మార్చి నెలలో నమోదైన కేసు వివరాలు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని నేడు హైకోర్టు ధర్మాసనంకు సమర్పించనున్నారు. వీటన్నిటినీ పరిశీలించిన తరువాత హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో, తిరిగి సిఐడి పునర్విచారణకు ఆదేశిస్తే 2023 మార్చినెలలో జరిగిన చోరీ కేసు, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, దర్యాప్తు, లోక్అదాలత్ ద్వారా మధ్యవర్తిత్వం జరిపి రాజీచేయడం వెనుక ఎవరి పాత్ర ఏమేరకు ఉందనే సంచలన విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందనేటి టిటిడి వర్గాల్లో చర్చమొదలైంది.
ఇదిలా ఉండగా (TTD) తిరుమలలోని పెద్దజీయంగార్ మఠంలో ఉండే రవికుమార్ పరకామణిలో విధుల్లో లెక్కలు రాసే రవికుమార్ మౌనం దేనికి సంకేతమో, ఉద్యోగిగా ఉండట, అమెరికాన్ డాలర్లు చోరీచేసి విజిలెన్కు అక్కడికక్కడే పట్టుబడటం, తదుపరి తిరుమల వన్ పోలీసులు అరెస్టుచేయడం జరిగిపోయింది. ఈ ఘటన అప్పట్లోనే టిటిడి పూర్తిస్థాయి విచారణ చేయలేద ఇప్పటికీ అరోపణలు. అంతేగాక సిసిటివి ఫుటేజీ ఆధారా మాయం చేసిన విజిలెన్స్ అధికారులపై కూడా చరూ తీసుకునే దిశగా సిఐడి ముందుకు కదలనుందా అ హాట్గా ట్రాఫిక్ మారింది. అసలు నిందితుడైన రవికు ఆచూకీ కూడా తెలియాలని తాజాగా బోర్డు సభు భానుప్రకాశ్ రెడ్డి మీడియా ముందుకు వచ్చాడు. ఆయా ఆచూకీ తెలియాలని పట్టుబడటం ఉత్కంఠ పరిణామాలే. కేసు ఇప్పుడు తిరిగి సిఐడి చేతికి వెళ్ళడం, హైక్ ఆదేశాలతో సిఐడి విచారణ ప్రారంభిస్తే రవికుమ ఎక్కడనున్నాడో తెలుసుకోవడం ప్రధానంగా మారింది. నేడు హైకోర్టుకు సిఐడి అధికారులు సమర్పించే ఆధారాలపై తదుపరి ఏం జరగనుందనే మాత్రం టిటిడి గత బోర్డు పెద్దల్లో ఉత్కంఠ రేపుతోంది. వడ్డీకానా వేంకటేశ్వరస్వామికి భక్తులు తమ మొక్కుబడుల రూపం హుండీకి సమర్పించిన విదేశీ కరెన్సీ చోరీలో పాత్రధారు రవికుమార్ను తప్పించిన ఘటనలో కీలక సూత్రధారం ఎవరనేది తేల్చనుందనే భయం పోలీస్ వర్గాల్లో సంచ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.
తిరుమల పరకామణి కేసులో ప్రధాన ఆరోపణ ఏమిటి?
నిందితుడు సివి రవికుమార్ విదేశీ కరెన్సీ చోరీ చేసి, 140 కోట్ల ఆస్తులు కూడగట్టారన్నది ప్రధాన ఆరోపణ.
ఈ కేసు ప్రస్తుతం ఎక్కడ ఉంది?
హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి విచారణ వివరాలు ధర్మాసనం ముందు సమర్పించనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: