తిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి ఏడాదిలో తొమ్మిదిరోజులు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు జాతీయ స్థాయిలో ఒక దృక్పధం తీసుకువచ్చే ఉద్దేశ్యంతో అన్ని రాష్ట్రాల కళాబృందాలకు అవకాశం కల్పించామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ (EO Anil Kumar Singhal)వెల్లడించారు. నభూతోనభవిష్యతి అనే రీతిలో జరిగే దేవదేవుని బ్రహ్మోత్సవాలకు ఆలయ మాఢవీధుల్లో గ్యాలరీల్లో 2లక్షలమంది భక్తులు వాహనసేవలు వీక్షించే అవకాశం ఉందన్నారు. ఇంకా గరుడసేవరోజు ప్రతి మాఢవీధి మూలల్లో 45 నిమిషాలు పాటు గరుడసేవ వీక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. పెరటాసి మాసం, దసరా సెలవులు రావడంతో ఈ ఏడాది అశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, మాఢవీధుల్లోని గ్యాలరీల్లో ఉదయం, సాయంత్రం వేచివుండే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్లు
టీటీడీ అదనపు ఈవో చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ లంకెల సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వి కెవీ మురళీకృష్ణ తిరుపతి కమిషనర్ మౌర్య, పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగాలతో కలసి అందరూ టీమ్ గా భక్తు లకు అవసరమైన సేవలందిస్తారని ఈవో తెలిపారు. సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాలు, కల్పించిన సదుపాయాలపై శుక్రవారం మధ్యాహ్నం అన్నమయ్య భవనంలో మీడియా ప్రతినిధులకు వివరించారు. 24వ తేదీ బుధవారం నుండి ఆలయ మాఢవీధుల్లో స్వామివారి వాహన సేవలు మొదలవుతాయన్నారు. ఉదయం, రాత్రి వేళ ల్లో మలయప్పస్వామి వాహనసేవల్లో అన్ని శాఖలు సిబ్బంది, అధికారులు టీమ్ గ్యాలరీల్లోని భక్తులకు అన్నప్రసాదాలు, బిస్కెట్లు, పాలు పంపిణీ చేస్తామని ఈవో సింఘాల్ తెలిపారు. ఉదయం 8గంటల నుండి రాత్రి 11గంటల వరకు వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదాలు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల వాహన సేవల్లో 28 రాష్ట్రాల నుండి 290 కళాబృందాలతో కళా ప్రదర్శనాలు ఏర్పాటు చేశామన్నారు. సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి కలియుగ వైకుంఠం తిరుమలలో బ్రహ్మోత్సవాల(Brahmotsavam in Tirumala)కు సర్వం సిద్ధమవుతోందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాకు తెలిపారు. బ్రహ్మోత్సవాలను సజావుగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని చెప్పారు.
ఈనెల 24వ తేదీ సాయంత్రం ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్స వాలు ఆరంభమవుతాయని, ఆ రోజు సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. తొలివాహనంగా ఆ రోజు రాత్రి పెద్దశేషవాహనం జరుగుతుందన్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు, గదుల ముందస్తు బుకింగ్ కేటాయింపు లపై కీలక ప్రకటన చేశారు. బ్రహ్మోత్సవాలలో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు, గదులు కేటాయింపు రద్దుచేశామని, అన్ని ఆర్జితసేవలు రద్దు చేశామన్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత “నిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో వెల్లడించారు. ఇప్పటికే తొమ్మిది రోజులుకు గాను 1.16లక్షలు 300 రూపాయలు ఎస్ఈడీ దర్శన టిక్కెట్లు విక్రయించామన్నారు. 8లక్షల లడ్డూలు ముందస్తుగా నిల్వ చేశామన్నారు. గ్యాలరీల్లోకి రాలేని భక్తులు తిరుమలలో పలు ప్రాంతాల్లో ఉండి వాహన సేవలు వీక్షించేందుకు వీలుగా 36 ఎస్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. 20 హెల్ప్ డెస్క్లు, ఐదు భాషల్లో భక్తులకు సమాచార వ్యవస్థను కల్పించా మన్నారు. గరుడసేవ జరిగే 28వ తేదీ రాత్రి మాఢ వీధుల్లో భక్తులకు అన్నప్రసాదాలు, సుండల్, టీ, కాఫీ అందించే ఏర్పాటు చేశామన్నారు. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో మాఢవీధుల్లో సౌకర్యాలు ఉంటాయన్నారు.
మాఢవీధుల మూలల్లో గరుడసేవ వీక్షణం
ఈ ఏడాది సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేషమైన గరుడసేవ జరిగే 28వ తేదీ రాత్రి ఆలయ మాఢవీధుల మూలల్లో గరుడసేవ వాహనాన్ని నిలిపి ఉంచి భక్తులకు దర్శనం కల్పిస్తామని అదనపు ఈవో చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి తెలిపారు. 45 నిమిషాలు నిలబెడతామన్నారు. తిరుమలనంబి, వసంత మండపం, వరాహస్వామి ఆలయ మూల ప్రాంతాల్లో గ్యాలరీల్లోకి చేరుకోలేని వెలుపల నిరీక్షించే మరింత భక్తులకు దాదాపు 40వేల మందికి ఈ వాహనసేవ వీక్షణం సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. టీటీడీపై ఆసత్య ప్రచారాలు, దుష్ప్రచార వార్తలు ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈవో హెచ్చరించారు. బ్రహ్మోత్సవాలను విస్తృతంగా వ్యాప్తిచేసేందుకు, ప్రచారం చేసేందుకు సామాజిక మాధ్యమాల వినియోగం పెంచామన్నారు. ఈ మీడియా సమావేశంలో టీటీడీ సీపీఆర్వో డాక్టర్ తలారి రవి, పీఆర్వో నీలిమ, తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ. డీఎస్పీ విజయశేఖర్, వీఎస్ వో ఎన్టీవీ రామ్కుమార్, సురేంద్ర పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: