తిరుపతి : ప్రపంచ ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం తిరుమల (tirumala) లడ్డుప్రసాదాల తయారీకి 2020 నుండి 2024వరకు కల్తీనెయ్యి సరఫరా చేయడం, అదే నెయ్యిని పోటులో వినియోగించారనే కేసులో సిబిఐ సిట్ అధికారుల దర్యాప్తులో గత బోర్డు పెద్దలు, గత అధికారులు ఎరక్కపోయి ఇరుక్కోబోతున్నారా? అనే అనుమానాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. కల్తీనెయ్యి బాగోతంలో తనప్రమేయం ఏమీ లేదని, ఇఒగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తాజాగా బుధవారం మాజీ టిటిడి ఇఒ ఏవి ధర్మారెడ్డి సిట్ డిఐజి మురళీ రాంభా, తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావు విచారణలో అప్రూవర్ గా మారడం ఎక్కడకు దారితీస్తుందోననేది మాత్రం విస్మయం కలిగిస్తోంది. ఇప్పుడు కల్తీనెయ్యి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదర్కొంటున్న గత ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సిట్ ఎదుట హాజరై నోరు విప్పితే ఎలాంటి పరిణామాలు జరగబోతాయో అనేది కూడా ఉత్కంఠగా మారింది.
Read also: AP: ఈఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భేష్!

TTD: కల్తీనెయ్యి వ్యవహారం – మాజీ చైర్మన్ వైవి నోరువిప్పితే ఏం జరుగుతుందో?
అప్రూవర్ గామారిన ధర్మారెడ్డి ఈ బాగోతంలో మొత్తం సుబ్బారెడ్డిదే నేరం అన్నట్లు వెల్లడించారనేది తెలుస్తోంది. కల్తీనెయ్యి వ్యవహారంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇదీ సిట్ అధికారులను కూడా విస్మయం కలిగించేలా మారింది. కల్తీనెయ్యి విషయంలో అక్రమంగా జరిగిందనేది మాజీ ఇఒ సమగ్రంగా ఆధారాలతో సిట్ కు వాంగ్మూలం ఇచ్చారని తెలిసింది. అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒత్తిడి , ప్రోద్బలం వల్లే ఇవన్నీ జరిగినట్లు సిట్ ముందు వెల్లడించారనేది సమాచారం. అవసరమైన సమాచారం కూడా అందించినట్లు తెలుస్తోంది. కల్తీనెయ్యి వ్యవహారంలో రెండవరోజు బుధవారం ఉదయం నుండి రాత్రి వరకు సాగిన విచారణలో మాజీ ఇఒ ధర్మారెడ్డి, బోలేబాబా డెయిరీ విపిన్ జైన్, పామిల్ జైన్ లను విచారణ చేశారు.
215కోట్లరూపాయలకు పైగా
కల్తీనెయ్యి సరఫరాలో ఇప్పుడు సుబ్బారెడ్డి రేపోమాపో తిరుపతిలోని సిట్ కార్యాలయానికి హాజరై విచారణలో నోరువిప్పితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఊహించలేని ఉత్కంఠగా నెలకొంది. రెండవ రోజు కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేశారనేది తెలుస్తోంది. గత ఐదేళ్ళలో 215కోట్లరూపాయలకు పైగా విలువైన 68.17 లక్షల కిలోల కల్తీనెయ్యి సరఫరా చేసినట్లు తేలిందని డిఐజి మురళీరాంభా తెలిపినా దానిపై సుబ్బారెడ్డి పాత్రపై ఇప్పుడు విచారణ చేయనున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనేది తెలుస్తోంది. 2019 నుండి 2024 వరకు మధ్యకాలంలో తిరుమల లడ్డూల తయారీకి అవసరమైన నెయ్యిసరఫరా టెండర్లు దక్కించుకుని కల్తీనెయ్యి పంపినా ఎందుకు నోరు మెదపలేదనే కోణంలో వైవి విచారణ సాగనుందనేది తెలుస్తోంది.
మురలీ రాంభాల ఆధారాలతో
కల్తీనెయ్యి పాపంలో ఎవరున్నారనే అంశంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన సిబిఐ సిట్ అధికారులు ఇప్పటికే పాత్రధారులైన పలువురు డెయిరీ ప్రతినిధులను అరెస్టుచేసింది. ఇప్పుడు మరింతగా లోతుగా దర్యాప్తుకు మాజీ చైర్మన్ వైవి పిఏ చిన్నఅప్పన్నను, కాంట్రాక్టర్ అజయకుమారు మూడు రోజుల కస్టడీకి సిట్ ఏసిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 14వతేదీ (రేపు) తీర్పు వస్తే వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరయ్యే సమయానికి వీరందరినీ కలిపి విచారణ చేసే అవకాశం ఉంది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, డిఐజి మురలీ రాంభాలు ఆధారాలతో కొన్ని ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారనేది తెలుస్తోంది. ఇప్పటికే డెయిరీ ప్రతినిధులను విచారణ చేసిన సిట్ అధికారులు నెయ్యి సరఫరా టెండర్లు దాఖలు, తరువాత పరిణామాలను రాబట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: