हिन्दी | Epaper
10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

TTD: అన్యమత ఉద్యోగుల పై ఏవీ చర్యలు? భగ్గుమంటున్న టిటిడి ఉద్యోగులు

Ramya
TTD: అన్యమత ఉద్యోగుల పై ఏవీ చర్యలు? భగ్గుమంటున్న టిటిడి ఉద్యోగులు

తిరుమల : హిందూ ధార్మిక సంస్థ టిటిడిలో తిరుమల శ్రీవారి ఆలయంలో కొందరు సిబ్బంది నామం. పెట్టుకోరు…ఓం నమో వేంకటేశాయ అనే నామం పలకరు…. దేవుని లడ్డూ ప్రసాదాన్ని కూడా తినరు.. ప్రసాదాలను తీసుకోరు… నెలకు వేలల్లో, లక్షలాది రూపాయలు దేవుని సొమ్మును జీతంగా తీసుకుంటూ ఇతర మత సాంప్రదాయంతో దేవుని, ప్రార్థనలు చేసుకొంటున్న అన్యమత ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంలో తిరుమల తిరుపతి దేవ. స్థానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్యమత ఉద్యోగులు పేరుకే హిందూ ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవ స్థానంలో కొనసాగుతూ మత దేవుడిని కొలుస్తుం డటం ఎంతవరకు మంచినన ప్రశ్నలు టిటిడి ఉద్యోగుల్లోనే వినిపిస్తున్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో అన్యమత ఉద్యో గులు యదేచ్చగా ప్రతి ఆదివారం ఏకంగా టిటిడి వాహనాల్లోనే మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరాలకు వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నాయనేది ఇప్పుడు గుప్పుమంటోంది. ఇప్పటికే టిటిడిలో 6,700మంది. శాశ్వత ఉద్యోగుల్లో 300 మంది. వరకు అన్యమత ఉద్యోగులు ఉన్నాదనేది టిటిడి (TTD) వర్గాల సమాచారం. వారిలో ప్రాధాన్యత పోస్టుల్లో ఉన్న 30మంది వరకు గుర్తించినా కేవలం ఐదుగురిపైనే వేటువేయడం ఇప్పుడు కలవరపరు స్తోంది. ఇంకా టిటిడిలో వేంకటేశ్వరస్వామి చెంత కొలువుల్లో కొనసాగుతూ అన్యమత ఆచరిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటే తప్ప మతమార్పిడిలను అరికట్టలేరనే వాదనలు వినిపిస్తున్నాయి.

TTD: అన్యమత ఉద్యోగుల పై ఏవీ చర్యలు? భగ్గుమంటున్న టిటిడి ఉద్యోగులు
TTD: అన్యమత ఉద్యోగుల పై ఏవీ చర్యలు? భగ్గుమంటున్న టిటిడి ఉద్యోగులు

“అన్యమత కార్యకలాపాలపై టిటిడి విజిలెన్స్ దాడులు – ఉద్యోగులపై చర్యలు, అమలులో వెనుకడుగు?”

రెండు వారాల క్రిందట టిటిడి మార్కెటింగ్ విభాగంలో వేలం సెక్టార్లో విధులు నిర్వహించిన అసిస్టెంట్ కార్యనిర్వహణాధికారి రాజశేఖర్ (Rajasekhar) తో బాటు అన్య మత ప్రార్థనలకు ఆ ప్రార్థనామందిరానికి వెలున్నాడనే ఆధారాలను ఫోటోలతో సహా టిటిడి విజిలెన్స్ సేకరించింది. దీంతో ఆయనపై సస్పెక్షన్ వేటువేశారు. బర్డ్ ఆస్పత్రి స్టాప్ నర్స్ ఎస్.రోషి, గ్రేడ్ 1 ఫార్మాసిస్ట్ ఎం.ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీకి చెందిన డాక్టర్ జి. అసుంతలు అన్యమతం ఆచరించడం, ఆ ప్రార్థనామందిరాలకు వెళ్లడంతో టిటిడి సస్పెండ్ చేసింది. ఇలా ఇంకా కొనసాగుతున్న అన్యమత ఉద్యోగులను సాగనంపాలని గతంలోనే ప్రస్తుత టిటిడి బోర్డు నిర్ణయం తీసుకున్నా అమలుచేయడంలో వెనుకడుగు వేస్తోందనేది ప్రధాన విమర్శ. గత రెండు దశాబ్దాలుగా టిటిడిలో అన్యమత ఉద్యోగులు (Non-religious employees in TTD) యధేచ్చగా వారివారి మతాలను ఆచరిస్తూ ప్రతి ఆదివారం ఆ ప్రార్థనామందిరాలకు వెళుతున్నారనేది ప్రస్పుటమైంది. కొందరు అధికారులు ఏకంగా టిటిడి (TTD) వాహనాల్లోనే ప్రతి ఆదివారం ప్రార్థనామందిరానికి వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

“శ్రీవారి సేవలో పవిత్రత నినాదం… కానీ ఆచరణలో నామమాత్రమే!”

దీనిపై అప్పట్లోనే ఉద్యోగులు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం చేసినా పట్టించుకున్న వారే లేకపోయారు. ఆ తరువాత అప్పటి బోర్డుకూడా అన్యమత ఉద్యోగులకు వంతపాడుతూ వారిపై చర్యలు తీసుకోలేకపోయింది. టిటిడిలో ప్రస్తుతం కొనసాగుతున్న పాలకమండలి తొలిరోజే తిరుమల పవిత్రతకు ప్రాధాన్యతనిచ్చి, శ్రీవారి ఆలయంలో హిందూ ఉద్యోగులే పనిచేయాలని కూడా స్పష్టం చేశారు. అయినా బోర్డు కొలువుదీరి ఏడాది కావస్తున్నా తీసుకున్న చర్యలు మాత్రం నామమాత్రమే. గత టిటిడి బోర్డు సమావేశాల్లోనూ అన్యమత ఉద్యోగులపై చర్యలుతీసుకునే దిశగా ప్రభుత్వ సలహాలు తీసుకున్నారు. అన్యమత ఉద్యోగులు స్వచ్చంద పదవీవిరమణ చేయడంగానీ, ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీపై వెళ్లడంగానీ నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అయినా ఇప్పటివరకు టిటిడిలో కీలకపోస్టుల్లో ఉన్న అధికారులు కొందరు, ఉద్యోగులు సిబ్బంది కూడా టిటిడిని వదలివెళ్లడానికి విముఖత చూపుతున్నారనేది పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్వచ్చందంగా కొందరు ప్రజలు, శ్రీవారిభకులు అన్యమత ఉద్యోగులపై ఆధారాలతో టిటిడికి ఉప్పందిస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో చర్యలు తీసుకుంటున్నారు.

“సీఎం స్పష్టమైన ఆదేశాల తరువాత కూడా… అన్యమత ఉద్యోగులపై చర్యలు ఎందుకు ఆలస్యం?”

హిందూ ధార్మిక సంస్థ టిటిడిలో తిరుమల శ్రీవారి ఆలయంతోబాటు పలుచోట్ల హిందూ ఉద్యోగులు మాత్రమే ఉండాలని, ఇతర మతస్థులు ఉండటానికి వీలులేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏడాది క్రిందటే గత బ్రహ్మోత్సవాల సమయంలో స్పష్టమైన ప్రకటన చేశారు. అయినా టిటిడి పాలకమండలిగానీ, అధికారులుగానీ ధైర్యంగా ఆ దిశగా తీసుకున్న చర్యలు మాత్రం లేవనేది ఉద్యోగవర్గాల్లో అసహనం. అన్యమతస్థులను గుర్తించి వారిని ఇతర శాఖలకు బదిలీ చేయడమో. లేక విఆర్ఎస్ ఇవ్వడమా అనేది చూడాలని సిఎం ఆదేశించినా టిటిడి అధికారులు ఆచరణలో పెట్టలేదు. ఇప్పటికీ అన్యమతస్థులుగా ముద్రపడిన అధికారులు, ఉద్యోగులు యధాతధంగా ఆయా కుర్చీల్లోనే కొనసాగుతున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి సైతం గతంలోనే స్పష్టమైన విషయాలు వెల్లడించారు. క్రైస్తవులు, ముస్లింలు ఆయా సంస్థల్లో, ఆయా మతాలకు సంబంధించిన కార్యాలయాల్లో వారే పనిచేస్తున్నారని, ఇతర మతస్థులను అనుమతించరనే విషయం తెలియజేశారు. అన్యమతస్థులు వివిధ కేడర్లలో ఇంకా పనిచేస్తుండటం, వారి సేవలను టిటిడి వినియోగించుకొంటుండటం కొసమెరుపు. దీనిపై గతంలోనే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసిన టిటిడి పాలకమండలి రాష్ట్ర దేవాదాయశాఖ చట్టం 1060, 24-10-1989 ప్రకారం హిందుమత సాంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టిటిడిలో ఉద్యోగం పొందిన తరువాత కూడా నిబంధనలకు విరుద్ధంగా, దేవుని పవిత్రతను దెబ్బతీస్తున్న కొందరు ఉద్యోగులను సాగనంపడంలో మీనమేషాలు వేస్తోంది. టిటిడి పవిత్రతకు భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి 69 మందితో ఓ జాబితాను కూడా రూపొందించింది.

టీటీడీ యజమాని ఎవరు?

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ఒక స్వతంత్ర ప్రభుత్వ ట్రస్ట్.

టీటీడీని 12 సంవత్సరాలు ఎందుకు మూసివేశారు?

తిరుమల ఆలయం 12 సంవత్సరాలు మూసివేయబడలేదు. అయితే, ఒక రాజు చర్యలు మరియు ఒక సాధువు శాపం కారణంగా 12 సంవత్సరాలు మూసివేయబడిందని ఒక పురాణం ఉంది. మరొక కథనం ప్రకారం, ఆలయాన్ని ప్రతి 12 సంవత్సరాలకు ఆరు రోజులు ఆచారాల కోసం మూసివేసేవారు. వాస్తవానికి, 2018 ఆగస్టులో అష్టబంధన మహా సంప్రోక్షణం కోసం ఆలయం ఆరు రోజులు మూసివేయబడింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Mithun Reddy: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870