ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కీలక ముందడుగు వేసింది. మహిళల ఆర్థిక భారం తగ్గించేందుకు, వారి సాధికారతను పెంచేందుకు ఉద్దేశించిన “స్త్రీ శక్తి” ఉచిత బస్ (“Women Power” Free Bus) పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రారంభించారు.విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 2.62 కోట్లకు పైగా మహిళలకు ప్రయోజనం చేకూరనుంది.ఎన్నికల సమయంలో మా ‘సూపర్ సిక్స్’ హామీలు నమ్మలేదు. కానీ ఇప్పుడు అవే ప్రజల జీవితం మార్చేలా మారాయి, అన్నారు చంద్రబాబు. ఆడబిడ్డలకు నిజమైన స్వతంత్రత ఇవ్వాలంటే ఆర్థికంగా నిలదొక్కుకునే స్థితి రావాలి. అందుకే ఈ పథకాన్ని ప్రారంభించాం అని చెప్పారు.

డ్వాక్రా నుంచి డ్రైవర్‌ల దాకా మహిళల ముందంజ
మహిళల ఆర్థిక పురోగతికి గతంలో డ్వాక్రా, మెప్మా సంఘాల ద్వారా బలమైన బేస్ ఏర్పాటైంది. ఆర్టీసీలో మహిళా కండక్టర్లు నియమించిన ఘనత కూడా చంద్రబాబు ప్రభుత్వానిదే. త్వరలో మహిళలే ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా నియమవుతారని సీఎం తెలిపారు.ఈ పథకం అమలుతో విద్యార్థినులు, ఉద్యోగినులు, చిన్న వ్యాపారులు, పల్లె నుండి పట్టణాలకు రోజూ వెళ్లే కూలీలకు ప్రయోజనం కలుగుతుంది. ప్రతి నెల సగటున రూ.4 వేల వరకు ఆదా అవుతుందని అంచనా. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతో ఉపశమనంగా మారుతుంది.ఇకపై రాష్ట్రంలోని మహిళలు ఆర్టీసీ పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. కండక్టర్లు ‘జీరో ఫేర్ టికెట్’ అందిస్తారు. విద్య, వైద్యం, ఉద్యోగం, ఆధ్యాత్మిక ప్రయాణం – ఏ అవసరమైనా ఉచిత ప్రయాణం వీలవుతుంది.

భక్తులకూ ప్రయాణంలో ఊరట
తిరుపతి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ వంటి ఆలయాలకు వెళ్లే మహిళా భక్తులకు ఇది పెద్ద ఊరట. ఇక తిరుగు ప్రయాణ ఖర్చు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎండీ ద్వారకా తిరుమలరావు, ఎంపీ కేశినేని చిన్ని సహా పలువురు ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలోని మహిళలకు ఇది ఒక కొత్త శక్తిని అందించబోతోందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also :