వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతి జూకు తరలింపు
చిత్తూరు : యాదమరి మండలం తెల్లరాళ్ళపల్లి పంచాయతీ గుడ్డివాని చెరువు బురద కుంటలో కూరుకు పోయిన(Tirupati Zoo) ఏనుగును ఎట్టకేలకు సోమవారం అటవీశాఖ, పోలీసు అధికారులు వెలుపలికి తీసుకువచ్చారు. ఏనుగు కాళ్ళకు తీవ్రంగా గాయాలు వుండటంతో ఏనుగుకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం దానిని మెరుగైన చికిత్స కోసం తిరుపతి జువాలజికల్ పార్కుకు(Tirupati Zoological Park) తరలించారు. యాదమరి మండలం తెల్లరాళ్ళపల్లి పంచాయతీ గుడ్డివాని చెరువు పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా ఒక ఒంటరి ఏనుగు తిరుగుతుండేది. తమిళనాడు నుండి ఇక్కడికి వచ్చిన ఏనుగు కాళ్ళకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి ఆ ఒంటరి ఏనుగు తెల్లరాళ్ళపల్లి పంచాయతీ పరిధిలో అటవీ ప్రాంతంలో వున్న గుడ్డివానిచెరువులోకి వెళ్ళి బురదలో చిక్కుకొంది.
Read also: తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు హాజరుకండి

ఏనుగును రక్షించి తిరుపతికి తరలింపు
ఈ విషయంను ఆదివారం తెల్లవారుజాము గుర్తించిన స్థానికులు అటవీశాఖ(Tirupati Zoo) అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు అటు తమిళనాడు రాష్ట్ర అటవీశాఖ అధికారులతో పాటు సిఎఫ్ యశోద ఆధ్వర్యంలో జిల్లా అటవీశాఖ అధికారి శ్రీనివాసులు, ఎఫ్తార్లు థామస్, పట్టాబిలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హరి, యాదమరి ఎస్ఐ ఈశ్వర్యాదవ్, ఇతర అధికారులు ఆధ్వర్యంలో చెరువు బురద కుంటలో చిక్కుకున్న ఏనుగును ఒడ్డుకు చేర్చడానికి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజాము నుండి అటవీ, పోలీసు శాఖలు చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇచ్చాయి. చెరువు ఊబిలో చిక్కిన ఏనుగును సురక్షితంగా సోమవారం బయటకు వచ్చింది. ఏనుగు బలంగా గాయపడి వుండటంతో ఏనుగు కాళ్ళకు ప్రథమచికిత్స దానిని తిరుపతి జువాలజిక్ పార్కుకు తరలించి అక్కడ చికిత్స చేయించాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. ఏనుగు సురక్షితంగా చెరువు నుండి బయటపడటంతో పలమనేరు నుండి వచ్చిన రెండు కుంకీ ఏనుగులు వెనుతిరిగి వెళ్ళాయి. చెరువు నుండి బయటపడ్డ ఏనుగును వాహనంతో తీసుకుని తిరుపతికి అటవీశాఖ అధికారులు తరలించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: