24నుండి వాహన సేవలు ప్రారంభం ఉత్సవాల బుక్లెట్ ఆవిష్కరణ తిరుమల (Tirupati) : బ్రహ్మాండనాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈఏడాది బ్రహ్మాండంగా నిర్వహిస్తామని, అందుకు BR నాయుడు (BR Nayudu) అన్ని ఏర్పాట్లుచేస్తున్నామని టిటిడి (TTD) ఛైర్మన్ తెలిపారు. 24వతేదీ నుండి ఉత్సవాల వాహనసేవలు ఆరంభమవుతాయన్నారు. రోజుకు రెండు వాహనాలపై మలయప్పస్వామి ఊరేగుతారన్నారు. ఆలయ మాఢ వీధుల్లో గ్యాలరీలను పటిష్టంగా నిర్మించామని, వర్షం వచ్చినా భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.

సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు
గ్యాలరీల్లో నిరంతారయంగా భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. (Tirupati) గరుడసేవరోజు 3లక్షలమంది భక్తులు వాహనసేవ వీక్షించేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. తొమ్మిదిరోజులుపాటు జరిగే తిరుమలేశుని బ్రహ్మోత్సవాల (Brahmotsavala) వాహనసేవలు, ఆలయంలో జరిగే స్వప్నతిరుమంజనం విశేషాల వివరాలతో ముద్రించిన వాహనసేవల బుక్లెట్ను మంగళవారం మధ్యాహ్నం అన్నమయ్య భవనంలో ఆవిష్కరించారు. 24వతేదీ సాయంత్రం ద్వజారోహణం, రాత్రి పెద్దశేషవాహనం, ఐదవరోజు 28వతేదీ రాత్రి గరుడవాహనసేవ, 29వతేదీ సాయంత్రం స్వర్ణరథం, (Golden chariot) అక్టోబర్ 1వ తేదీ రథోత్సవం, 2వతేదీ ఉదయంర ఉదయం చక్రస్నానం విశేష ఘట్టాలు.
ఈ ఏడాది తిరుమల బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహించబోతున్నారు?
A1: ఈ ఏడాది బ్రహ్మాండంగా నిర్వహించబోతున్నామని, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టిటిడి ఛైర్మన్ తెలిపారు.
వాహనసేవలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి?
A2: సెప్టెంబర్ 24వ తేదీ నుండి వాహనసేవలు ప్రారంభమవుతాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: