దేశంలో ప్రజాస్వామ్యాన్ని బిజెపి ఖూనీ చేస్తోంది
మంచి పాలన అందించే కాంగ్రెస్కు అండగా నిలవండి
ఏపీ యువజన కాంగ్రెస్ ఎన్నికలకు ఏడు నుంచి నామినేషన్ల స్వీకరణ
జెడ్ ఆర్ వో త్రిబువన్
బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, అన్నదమ్ముల కలసి జీవిస్తున్న వారి మధ్య కులమతాల పేరుతో చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని జెడ్ ఆర్ వో త్రిబువన్ మండిపడ్డారు. తిరుపతి (Tirupati) ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేస్తోందన్నారు. దేశ ప్రజలు ఏం తినాలి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఏ మతం అనుసరించాలి అని తానే నిర్ణయిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాలన దేశానికి అత్యవసరమని దీనిని గుర్తించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
Read also: Chandrababu : రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యంగా యువత యువజన కాంగ్రెస్లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించాలని ఏఐసిసి నిర్ణయించిందన్నారు. అందులో భాగంగానే తాను జెడ్ ఆర్ వో గా నియమితుడై ఎన్నికల నిర్వహణకు రావడం జరిగిందని తెలిపారు. ఈనెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు యువజన కాంగ్రెస్ లో మండల, అసెంబ్లీ కమిటీలకు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. 21వ తేదీ నాటికి నామినేషన్ల స్వీకరణ పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 7 నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే వాటిని కూడా స్వీకరిస్తామన్నారు.
ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్ లోనే పూర్తవుతుందని ఆయన వివరించారు. 35 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు ఈ యువజన కాంగ్రెస్ ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులని ఆయన చెప్పారు. రాష్ట్రంలో తిరుపతి (Tirupati) , ప్రకాశం, విజయనగరం జిల్లాలు ఎస్సీలకు రిజర్వేషన్ చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి కార్యకర్త దరఖాస్తులు చేసుకోవాలన్నారు. జనవరి 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఆంధ్ర రాష్ట్ర యువజన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలియజేశారు.
సంస్థాగత ఎన్నికలను నిర్వహిస్తోంది
యువజన కాంగ్రెస్ సభ్యత్వం ఉన్నవారు ఒక్కొక్కరు 6 ఓట్లు వేయాల్సి ఉంటుందని తెలిపారు. సభ్యత్వం ప్రక్రియలు కూడా ఆన్లైన్లో జరుగుతుందని అన్నారు. దేశంలో అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించబడుతున్నది యువజన కాంగ్రెస్ మాత్రమే అన్నారు. గ్రామ స్థాయి నుంచి జాతీయస్థాయికి రాజకీయంగా ఎదగడానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అత్యుత్తమ అవకాశం కల్పిస్తోందని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు బాల గురవం బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒకటి రాజ్యాంగబద్ధంగా సంస్థాగత ఎన్నికలను నిర్వహిస్తోందని వివరించారు. విద్యార్థి, యువజన, మహిళ ఇతర విభాగాల అన్నింటికీ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిరుస్తోందని వివరించారు. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కులమతాలకు పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు రాజకీయంగా ఎదగడానికి మంచి వేదిక అన్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.సమావేశంలో గౌడపేరు చిట్టిబాబు, తిరుపతి జిల్లా అధ్యక్షులు బాల గురవం బాబు, పీసీసీ జనరల్ సెక్రెటరీ తమటం వెంకట నర్సింహులు, శ్రీ కాళహస్తి నియోజకవర్గం ఇంచార్జ్ తలపామోదర్ రెడ్డి, ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు శివ బాలాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిన్నే మల్లికార్జున్, తిరుపతి సిటీ మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బివి గౌడ్, తిరుపతి జిల్లా ఎస్టీ విభాగం అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, తిరుపతి సిటీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: