గంజాయి, ఇతర మాదకద్రవ్యాల పై ఉక్కుపాదం మోపుతూ జిల్లా అంతటా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు చిత్తూరు (Chittoor) 1టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర కీ రాబడిన సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం సుమారు 3.40 గంటలకు చిత్తూరు (Chittoor) పట్టణములోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండపల్లిలోని అడవి నందు ఇద్దరు వ్యక్తులు ఒక నల్లటి కవర్ ను పెట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద 1.1 కిలోల గంజాయి లభించిగా స్వాధీనం చేసుకుని 2 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం 1 టౌన్ ఇన్స్పెక్టర్ వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది.
Read also: Gramine Home Foods scam : గ్రామీణ హోం ఫుడ్స్ మోసం: రూ. కోట్ల ఫ్రాంచైజీ స్కామ్, ముగ్గురు అరెస్ట్

సదరు కేసులో సమాచారం అందిన వెంటనే ముద్దాయిలను అరెస్ట్ చేసిన 1 టౌన్ పోలీసులను జిల్లా ఎస్పీ తుషార్ డూడి, అభినందించారు.
ముద్దాయిల వివరాలు:
- హరిబాబు, వయసు 42 సంవత్సరాలు, తండ్రి: (పేరు), నివాసం: ఏఎం పురం హరిజనవాడ, ఎస్.ఆర్.పురం మండలం.
- పవన్ కళ్యాణ్, తండ్రి: గిరి, నివాసం: పాపిరెడ్డిపల్లి హరిజనవాడ, ఎస్.ఆర్.పురం మండలం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: