
తిరుపతి(Tirupati)లోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం(Govindarajaswamy Temple)లో భయానక ఘటన చోటుచేసుకుంది. ఏకాంత సేవ అనంతరం ఆలయ గేట్లు మూసిన తర్వాత లోపలికి ప్రవేశించిన మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి నినాదాలు చేస్తూ, 90ml మద్యం ఇస్తే కిందకి దిగుతానని డిమాండ్ చేయడం ఆలయ వర్గాలను కలచివేసింది.
Read also: Telangana Assembly : రేపు అసెంబ్లీలో కృష్ణా జలాలపై ప్రభుత్వం PPT
స్థానిక ఈస్ట్ పోలీస్ శాఖ మరియు ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సుమారు మూడు గంటలపాటు ప్రయత్నించి, తాళ్లతో బంధించి అతన్ని కిందకి దిగించారు. ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనలో గోపురంపై ఉన్న రెండు కలశాలు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. అయితే, ఆలయ ప్రధాన నిర్మాణానికి ఎటువంటి హాని తగలలేదు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: