ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి (Tirupati) నగరంలో ర్యాపిడో బైక్ రైడర్ ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే, శనివారం అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో తిరుపతి (Tirupati) లోని ఓ బ్యూటీ పార్లర్‌లో పని ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు ఓ మహిళ ర్యాపిడో బుక్ చేసుకుంది. బుకింగ్ వచ్చిన వెంటనే రైడర్ పెద్దయ్య అనే వ్యక్తి ఆమెను పికప్ చేసుకొని గమ్యానికి బయల్దేరాడు. మార్గమధ్యంలో సాధారణంగా ప్రవర్తించిన రైడర్, గమ్యానికి చేరుకున్న తర్వాత మాత్రం అకస్మాత్తుగా అసభ్యంగా ప్రవర్తించాడు.
Read Also: Chevella Crime: అయ్యో ఈ పిల్లలకు దిక్కెవరు!

గమ్యం చేరుకున్నాక రైడర్ బలవంతంగా ఆ మహిళకు ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనతో షాక్ అయిన బాధితురాలు కేకలు వేయడంతో పరిసరాల్లో ఉన్న వారు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో ఆమె భర్త అక్కడకు చేరుకుని ర్యాపిడో రైడర్‌ను పట్టుకున్నారు. తర్వాత అక్కడ నైట్ పేట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వచ్చి రైడర్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: