తిరుపతి Tirumala : హిందూ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిదేవస్థానం సంప్రదాయాలు, ఆలయ మర్యాదలపై మళ్ళీ మాటలయుద్ధం మొదలైంది. అటు వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతో ఇలాంటివన్నీ గత ఐదేళ్ళ తప్పిదాలు సమయంలో కనబడలేదా?అంటూ ప్రస్తుత బోర్డుసభ్యుడు భానుప్రకాష్ రెడ్డి Bhanu Prakash Reddy తీవ్రస్థాయిలో విమర్శించారు. టిటిడి అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి శ్రీవారి సేవకుడిగా సేవలందిస్తున్నారు. ఆయనకు గత నెలలో తండ్రిని కోల్పోవడంతో జరిగిన పెద్దకర్మ అనంతరం టిటిడి తరపున సంప్రదాయంగా ఆయన నివాసానికి వెళ్ళి ఛైర్మన్ బిఆర్నాయుడు, ఆలయ అర్చకులు పరివట్టం కట్టడం, వేదాశీర్వచనంచేయడం, ప్రసాదాలు అందజేశారు.
Nara Lokesh: సంస్కరణలతోనే ఐటిఐలో తెలుగు విద్యార్థుల ప్రతిభ

Tirumala
బి.ఆర్.నాయుడు
ఇదంతా ఆలయ సంప్రదాయంగానే సాగింది. అయితే శ్రీవేంకటేశ్వరస్వామి సేవకుడిగా ఛైర్మన్ బిఆర్నాయుడు ఆలయ మర్యాదలను మంట గలుపుతున్నారని మాజీ టిటిడి ఛైర్మన్, వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి Karunakar Reddy దాన్ని రాద్ధాంతం చేస్తూ సోమవారం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఛైర్మన్ బి.ఆర్.నాయుడు పట్ల వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ద్వేషం లేదని, ఆయన వ్యవహారాలు, ఎప్పుడు ఎలా ఉండాలో తెలియక ఆలయ మర్యాదలను మంటలో గలుపుతున్నారని విమర్శించారు. వెంకయ్యచౌదరిని పరామర్శించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోందని అన్నారు.
అయితే ఈ విమర్శలను బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తప్పులు చేయడం, తప్పుడు మాటలు మాట్లాడటం కరుణాకర్ రెడ్డికి అలవాటైపోయిందని ఎద్దేవాచేశారు. 2023లో అప్పటి టిటిడి ఇఒ ధర్మారెడ్డి కుమారుడు మరణిస్తే పెద్దకర్మ తంతు పూర్తయ్యాక ఆలయ మర్యాదల ప్రకారం ఆ గ్రామానికి వెళ్ళి ఆ అధికారికి పరివట్టం కట్టడం, ప్రసాదాలు అందజేసి వేదపండితులు వేదాశీర్వచనం అందించినపుడు అది నీకు అపచారంగా అనిపించలేదా;?ఛైర్మన్ హోదాలో అప్పుడు కళ్ళుమూసుకున్నావా అని ఘాటుగా స్పందించారు.
తిరుమల ఆలయ సంప్రదాయాలపై మాటల యుద్ధం ఎందుకు మొదలైంది?
టిటిడి అదనపు ఇఒ వెంకయ్య చౌదరి తండ్రి పెద్దకర్మ అనంతరం టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు ఆలయ సంప్రదాయం ప్రకారం పరివట్టం కట్టడం, వేదాశీర్వచనం చేయడంతో, వైసిపి నేత భూమన కరుణాకర రెడ్డి ఇది ఆలయ మర్యాదలకు విరుద్ధమని ఆరోపించడం వల్ల వివాదం మొదలైంది.
భూమన కరుణాకర రెడ్డి విమర్శలకు ఎవరు స్పందించారు?
టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి స్పందించి, భూమన కరుణాకర రెడ్డి తప్పుగా ఆరోపణలు చేస్తున్నారని, ఆలయ సంప్రదాయాల ప్రకారం చర్యలు జరిగాయని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
EPaper: https://epaper.vaartha.com/
Read Also: