TTD calendars: ధార్మికసంస్థ తిరుమల(Tirumala) తిరువతిదేవస్థానం ముద్రించిన 2026 నూతన సంవత్సరం క్యాలండర్లు, డైరీలకు దేశ విదేశాలలోని శ్రీవారి భక్తులనుండి అనూహ్యస్పందన వస్తోంది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 2026వ సంవత్సరం 12 పేజీల క్యాలండర్లు 13లక్షలు, ఆరు పేజీల క్యాలండర్లు 75వేలు, పెద్దడైరీలు 3.50లక్షలు, చిన్నడైరీలు 3లక్షలు, టేబుల్స్టాప్ క్యాలండర్లు 1.50లక్షలు, శ్రీవారి పెద్దక్యాలండర్లు 2.50లక్షలు, పద్మావతిఅమ్మవారి పెద్ద క్యాలండర్లు 10 వేలు, శ్రీవారుపద్మావతి అమ్మవారు క్యాలండర్లు 3లక్షలు, టిటిడి స్థానిక ఆలయాల క్యాలండర్లు 10వేలు అత్యంత ఆకర్షణీయంగా ముద్రించి అందుబాటులో ఉంచింది.
Read Also: IRCTC: తక్కువ ధరకే దక్షిణాది ఆలయాల టూర్ – ప్రత్యేక ఆఫర్!
తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తకవిక్రయకేంద్రాలతోబాటు దేశంలోని పలు టిటిడి ముఖ్యప్రాంతాల్లో విక్రయాలు జరుగుతున్నాయన్నారు. భక్తులు ఆన్లైన్లో కూడా బుక్చేసుకునేందుకు వీలుగా “డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. తిరుమల. ఓఆర్, టిటిడిదేవస్థానమ్స్(WWW. Tirumala. OR, TTD Devastanams). ఎపి.జివొవి.ఇన్లో బుక్చేసుకున్న భక్తులకు తపాల శాఖద్వారా పంపబడుతుందన్నారు. టిటిడి ఇఒ పేరున డిడి తీసి కవరింగ్ లెటర్తో పంపినా భక్తులకు టిటిడి క్యాలండర్లు, డైరీలు తపాలశాఖద్వారా పంపబడుతుందన్నారు. మరిన్ని వివరాలకు 0877-2264209 నంబరు సంప్రదించాలని తెలిపారు.




Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: