తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నెల 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతోంది.. ఆరోజు మధ్యాహ్నం 1.23 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభమవుతాయి. ‘తిరుమల (Tirumala) లో ఈ నెల 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతి రోజూ స్వామివారికి అలంకరిస్తారు.
Read Also: AP: ఏపీలో వారికి రూ.5వేలు

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: