తిరుమల: ఏడుకొండలవాడి ఆలయానికి నడిచి వెళ్లే పవిత్రమైన అలిపిరి మెట్ల మార్గంలో టీటీడీ కాంట్రాక్టు సిబ్బంది మాంసాహారం తినడం స్థానికంగా, భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ ఘటనతో పవిత్రమైన మెట్ల మార్గం అపవిత్రతకు గురైందని భక్తులు మండిపడ్డారు. తిరుమల కొండపై మరియు మెట్ల మార్గంలో మాంసాహారం, మద్యం వినియోగం పూర్తిగా నిషేధం అన్న విషయం తెలిసిందే.
Read Also: Uttar Pradesh crime: అత్యాచార బాధితురాలిపై న్యాయవాది లైంగిక దాడి

భక్తుల ఆగ్రహం, వీడియో వైరల్
బహిరంగంగా మటన్ తింటూ కనిపించిన ఆ కాంట్రాక్టు పారిశుద్ధ్య(Contract Sanitation) కార్మికుల చర్యను చూసి అటుగా వెళ్తున్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు భక్తులు ఈ దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. ఆ వీడియో వెంటనే సోషల్ మీడియాలో(social media) పోస్ట్ చేయడంతో అది విపరీతంగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో, ఈ విషయం టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.
టీటీడీ చర్యలు, హెచ్చరిక
తిరుమల(Tirumala) పవిత్రతకు భంగం కలిగించినందుకు గాను టీటీడీ అధికారులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. టీటీడీ ఆరోగ్య విభాగం అధికారులు వెంటనే రంగంలోకి దిగి, మాంసాహారం తిన్న ఆ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు రామస్వామి, సరసమ్మలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను టీటీడీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని అధికారులు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: