కీలక ఫిర్యాదుదారుడు మృతితో తర్జనభర్జనలు
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి భక్తులు మొక్కుబడుల రూపంలో సమర్పించుకునే కానుకల్లో అమెరికన్ డాలర్లు చోరీకేసులో తొలిసారి నమోదైన కేసు విచారణలో తాజాగా ట్విస్ట్నెలకొంది. 2023 ఏప్రిల్లో జరిగిన 920 అమెరికన్ డాలర్లు చోరీ కేసుపై(Tirumala) పరకామణి పూర్వ ఏవిఎస్ వైవి సతీశ్ కుమార్ భౌతికంగా లేకపోవడం, దర్యాప్తు సాగుతున్న ఈ కేసులో అడ్డంకులు రాకుండా కొత్తగా మరో కేసును నమోదు చేయాలని టిటిడి(TTD) బోర్డు ఇటీవల నిర్ణయించింది. గత కేసు నమోదు అంత పటిష్టంగా లేదనే వాదనలతో క్రిమినల్ కేసుగా తిరుమల పోలీసులకు మళ్ళీ తాజాగా ఫిర్యాదు చేయాలని భావించారు.
Read also: గాంధీ ఆస్పత్రిలో ఏడేళ్ల బాలుడికి ప్లీహం తొలగించే శస్త్రచికిత్స

కొత్త కేసు నమోదు పై పోలీసుల సందిగ్ధం
అయితే ఇప్పుడు ఎవరిచేత(Tirumala) ఈ కేసు పై ఫిర్యాదు చేయించాలి అనేది ఇప్పుడు సందిగ్ధత నెలకొందని తెలుస్తోంది. అదేగాక ఇప్పటికే ఈ చోరీ కేసుపై 2023లో తిరుమల వన్స్టన్ పోలీసులు 24/2023గా ఎఫ్ఎఆర్ కూడా చేశారు. ప్రధాన నిందితుడు సివి రవికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేయకున్నా కోర్టు వరకు వెళ్ళింది. ఆ తరువాత కొన్ని పరిణామాలతో ఈ కేసును అదే ఏడాది సెప్టెంబర్లో లోక్అదాలత్లో మధ్యవర్తిత్వం ద్వారా రాజీకుదుర్చుకున్నారు. ఇందుకుగాను రవికుమార్ నుండి 14కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను వేంకటేశ్వరస్వామికి విరాళంగా అందించామని గత బోర్డులో తీర్మానం చేయడం జరిగింది. ఈకేసు పూర్తిగా పక్కదారిపట్టి నిందితుడినుండి పెద్దలు లబ్దిపొందారనే ఆరోపణలతో హైకోర్టు ఆదేశాలతో సిఐడి అధికారులు గత రెండు వారాలుగా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు కూడా. ఇప్పుడు హైకోర్టు పరిశీలనలో ఉన్న కేసుపై మళ్ళీ కేసు ఎలా నమోదు చేయాలనే అంతర్మధనం పోలీసుల్లో వ్యక్తమవుతోంది. అదేగాక కీలకమైన టిటిడి బోర్డు ఫిర్యాదు చేస్తే ఎలా కేసు నమోదు చేయాలని తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :