మాజీలపై దృష్టి పెట్టిన సిఐడి విచారణకు పిలిచే అవకాశం
తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి భక్తులు కానుకలు లెక్కించే పరకామణి నుండి విదేశీ కరెన్సీ చోరీ కేసు, తదనంతరం లోక్అదాలత్లో రాజీజరగడం వంటి కీలక పరిణామాల వెనుక గత టిటిడి పెద్దలు ఉన్నారనే విషయం సిఐడి దృష్టికి వచ్చిందని తెలుస్తోంది. ఈ(Tirumala) బాగోతంలో రానున్న రెండుమూడురోజుల్లో మాజీ టిటిడి(TTD) పెద్దలతోబాటు మాజీ పోలీస్ అధికారిని విచారణకు పిలిచే అవకాశం ఉందని కీలక సమాచారం. పరకామణిలో చోరీ కేసు విషయంపై హైకోర్టు ఆదేశాలతో సివి గత ఏడెనిమిదిరోజులుగా తిరుపతిలోనే మకాం వేసిన సిఐడి డిజి రవిశంకర్అయ్యన్నార్, ఎస్పీలు, డిఎస్పీలు ఐదు బృందాలు క్షేత్రస్థాయిలో సమాచారం రాబట్టారు. నిందితుడైన రవికుమార్ వ్యవహారంపైకూడా దాదాపు కీలక సమాచారం సేకరించింది. ఆయనకు సంబంధించిన ఆస్తులు, వాటి అంచనాలు వంటి విషయాలను రాబట్టింది. ఇప్పుడు కీలకంగా మారిన రాజీధోరణి వ్యవహారంలో కొందరు మాజీ పెద్దలపై దృష్టి సారించారు. ఇదేగాక తాజాగా బుధవారం సాయంత్రం టిడిపి నాయకులు సిఐడిడిజి రవిశంకర్అయ్యన్నార్ను తిరుపతిలో కలసి పరకామణి దొంగతనం కేసులో ముగ్గురుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వినతిపత్రం అందజేశారు.
Read also: కేంద్ర మంత్రి సంతకంతో..99 లక్షల దోపిడి

డిసెంబర్ 2కి హైకోర్టుకు నివేదిక సమర్పించనున్న సిఐడి
ఈ కేసులో గత టిటిడి(Tirumala) చైర్మన్ లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, మాజీ ఇఒ ఏవి ధర్మారెడ్డి, ఓ పోలీస్ ఉన్నతాధికారి కలసి కుమ్మక్కై వాటాలు పంచుకున్నారని ఆరోపించారు. వీళ్ళే కేసు నీరుగార్చే ప్రయత్నం చేసి రాజీచేశారని విన్నవించారు. దీంతో ఇప్పుడు పరకామణి కేసులో కొత్త మలుపుతిరగనుంది. తిరుమల పరకామణిలో 2023 ఏప్రిల్లో జరిగిన చోరీ ఘటన, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలతో సిఐడి బృందం దర్యాప్తు వేగవంతంగా కొనసాగిస్తోంది. పూర్తి విషయాలు డిసెంబర్ 2కి హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. తిరుమలలో పరకామణి భవనం, కమాండ్ కంట్రోల్రూమ్, సిసిటివి దృశ్యాలు పరిశీలించారు. రవికుమార్ పాత్ర, 2023 ఏప్రిల్లో చోరీ జరిగిన ప్రాంతం, ఎలా పట్టుబడ్డాడు అనే వివరాల ఆధారాలు సేకరించి కొందరు అధికారులను విచారణ చేశారు. రవికుమార్కు సంబంధించి రికార్డుల మేరకు తిరుపతి, హైదరాబాద్, తమిళనాడు, కర్నాటకలో 50కోట్లరూపాయలకుపైగా విలువైన ఆస్తులు న్నట్లు కూడా గుర్తించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: