టిటిడి బోర్డు నిర్ణయం బాధ్యులెవరైనా క్రిమినల్ కేసులు నమోదుచేయాలని తీర్మానం
తిరుమల : దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన తిరుమల పరకామణిలోచోరీ(Tirumala) కేసు ఉదంతంపై భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, నిష్పక్షపాతంగా విచారణచేయాలని టిటిడి బోర్డు నిర్ణయించింది. ఇందుకు సిఐడి అధికారులకు అవసరమైన సహ కారం టిటిడి అందిస్తుందన్నారు. ఈ కేసులో ఎంతటివారున్నా, ఎంత టివారైనా క్రిమినల్ కేసులు నమోదు చేసి సమగ్రదర్యాప్తు చేయాలని తీర్మా నించారు. మంగళవారం తిరుమల అన్నమయ్యభవనంలో తిరుమల అన్నమయ్యభవనంలో టిటిడి ధర్మకర్తలమండలి అత్యవసర సమావేశమైంది. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమావేశంలో టిటిడి(TTD) ఇఒ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి, సివిఎస్ కెవి మురళీకృష్ణ, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవునికి భక్తులు విశ్వాసంతో సమర్పించే కానుకలు పరకామణి భవనంలో లెక్కించేసమయంలో రవికుమార్ అనే ప్రైవేట్ ఉద్యోగి 2023లో 920 అమెరికన్ డాలర్లు చోరీ చేసినవిషయం పై సిఐడి విచారణ సాగిస్తోంది.
Read also: వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట రెడ్డి కి బెయిల్

పూర్వ ఏవిఎస్ఐ సతీశ్ కుమార్ హత్యపై బోర్డులో చర్చ
ఈ(Tirumala) కేసులో కీలకమైన, ఫిర్యాదిదారుడు పూర్వ ఏవిఎస్ఐ వై. సతీశ్ కుమార్ హత్యకు గురవడంతో టిటిడి బోర్డులో తీవ్రంగా చర్చించారు. అనేక మలుపులు తిరిగిన ఈ చోరీ కేసు ఉదంతంలో లోక్అదాలత్వరా రాజీ చేసిన వెనుక కుట్ర ఎవరిది, ఎవరు హస్తం ఉందనేది ఇప్పుడు తేలిపోనుంది. ఇందులో దర్యాప్తు పారదర్శకంగా, వేగంగా సాగుతున్న సమయంలో పూర్వ ఏవిఎస్ఒ హత్యకు గురైనట్లు ఆరోపణలపై టిటిడి బోర్డులో కూడా చర్చచేశారు. ఓ ఉద్యోగి ఏకంగా కానుకలనే చోరీచేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనేది బలమైన ఆరోపణలు. ఈ నేపధ్యంలో సిఐడి అధికారులు లోతైన విచారణ చేస్తున్నారు. అలాగే ఆం ధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రెండో ప్రాకారం నిర్మాణానికి ఈనెల 27వతేదీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూమిపూజలో పాల్గొంటారని చైర్మన్ నాయుడు తెలిపారు. ఈ సమావేశంలో టిటిడిఆలయ డిప్యూటీ ఇఒ ఎం.లోకనాథం, వింగ్ విఎస్ ఎన్టీవిరామ్కుమార్, బోర్డు సభ్యులు భానుప్రకాశొడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నర్శిరెడ్డి, పనబాకలక్ష్మి, శాంతారామ్, జాస్తిపూర్ణసాంబశివరావు, సదాశివరావు, ఎంఎస్ రాజు, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవి, పిఆర్ ఒ నీలిమ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: