21న వర్చువల్ సేవా టిక్కెట్లు, 23న అంగప్రదక్షిణ టోకెన్లు
Tirumala : శ్రీవేంకటేశ్వర స్వామి రోజువారీ, వారాంతపు ఆర్జితసేవలకు సంబంధించి నవంబర్నెలకోటా టిక్కెట్లు సోమవారం ఉదయం నుండి టిటిడి (TTD) ఆన్లైన్లో విడుదల చేస్తోంది. ఇందుకు టిటిడి ఐటి విభాగం అన్ని ఏర్పాట్లుచేసింది. కాగా నవంబర్ నెలనుండి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనాల టిక్కెట్ల దర్శన సమయం సాయంత్రం 4.30గంటలకు నిర్ణయించింది. ఈ సేవా టిక్కెట్లు ఆన్లైన్ డిప్ విధానంలో, కొన్నిసేవలు ముందువచ్చిన భక్తులకు ముందు అనే ప్రాతిపదికన ఆన్లైన్ విధానంలో భక్తులు నేరుగా బుక్చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. నేడు 18వతేదీ ఉదయం 10గంటలకు ఆన్లైన్లో ఆర్జితసేవా టిక్కెట్లు విడుదల చేస్తే 20వతేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఈ టిక్కెట్లు పొందిన భక్తులు 20వతేదీ నుండి 22వతేదీ మద్యాహ్నం 12 గంటలలోపు సొమ్ముచెల్లించి టిక్కెట్లు మంజూరవుతాయి.

21వ తేదీ ఉదయం 10గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలం కారసేవల టిక్కెట్లను విడుదల చేయనుంది. 212 ఆన్లైన్లో వర్చువల్ సేవా టిక్కెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతాయి. 23వతేదీ అంగప్రదక్షిణ టోకెన్లు ఉదయం 10గంటలకు, శ్రీవాణి బ్రేక్ టిక్కెట్లు కోటా రోజుకు 500 లెక్కన ఉదయం 23న 11గం టలకు విడుదల చేస్తారు. వృద్ధులు దివ్యాంగులు దర్శన కోటా ఆగస్ట్ 23న మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తారు. 300 రూపాయలు (300 rupees) ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటా 25న ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. గదుల కోటాను మధ్యాహ్నం 3గంటలకు ఆన్లై న్లో విడుదల చేస్తారు. భక్తులు ఆన్లైన్లో స్వామివారి దర్శన టిక్కెట్లును ‘టిటిదేవస్థానమ్స్. ఎపి.జివొవి.ఇన్’వెబ్సైట్స్వారా బుక్ చేసుకోవాలి.
READ HINDI NEWS : hindi.vaartha.com
BOOK TICKETS : https://www.tirumala.org/
READ ALSO :