Tirumala : వైకుంఠం నుండి కలియుగ వైకుంఠం శేషాచలంలోని నారాయణగిరి శిఖరంపై తొలిసారి పాదం (First time foot) మోపిన శ్రీవేంకటేశ్వర స్వామి పాదాలకు బుధవారం ఛత్రస్థాప నోత్సవం వేడుకగా జరిగింది. ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంనుండి మంగల వాయిద్యాల నడుమ పూజాసామాగ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో ఆలయ మాఢవీధుల మీదుగా అర్చకులు మేదరమిట్టకు చేరుకున్నారు. అక్కడ నుండి నారాయణగిరికి విచ్చేశారు. ముందుగా శ్రీవారి పాదాలకు శాస్త్రోక్తంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరిజలంతో అభిషేకం చేశారు. అలంకారం, పూజ చేసి నైవేద్యం సమర్పించారు. వేదపారాయణదారులు ప్రబందశాత్తుమొర వినిపించారు. భక్తులకు (Devotees) ప్రసాద వితరణ చేయడంతో పాదాలకు ఛత్రస్థాపనోత్సవం ముగిసింది. ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి కావున పాదాలకు రక్షణ కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ పారుపత్తేదార్ హిమత్గారి, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గోన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :