కదులుతున్న టిటిడి గత పెద్దల గుట్టు- ఎసిబి కోర్టులో అప్పన్న కస్టడి పిటిషన్
తిరుమల : తిరుమల(TTD) లడ్డూల తయారీలో కల్తీనెయ్యి(Tirumala Laddu) సరఫరాచేసిన పాపంలో సూత్రధారులైన గత టిటిడి పెద్దల అవీనీతిగుట్టు రట్టయ్యే సమయం ఆసన్నమైంది. ఇందులో ముఖ్యంగా 2022లో అప్పటి టిటిడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అక్రమాలు భారీగానే ఉన్నాయని సిబిఐ సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ కీలకమైన సంచలన కేసులో వైవి సుబ్బారెడ్డి అంతరంగికుడు వ్యక్తిగత సహాయకుడుగా (పిఎ)గా వ్యవహరించిన కె. చిన్న అప్పన్నను సిట్ అధికారులు అరెస్ట్్చసి రిమాండ్కు తరలించారు. ఈ కల్తీనెయ్యి గుట్టులో కీలకంగా సిట్ సుబ్బారెడ్డిని భావిస్తోంది. ఇంకా మరింత కీలక సమాచారం సేకరించడానికి అప్పన్నను కస్టడీకి తీసుకునేందుకు సిఐబి సిట్ అధికారులు నెల్లూరు ఏసిబి కోర్టులో శుక్రవారం కస్టడీ పిటిషన్ దాఖలు చేశారనేది తెలుస్తోంది. న్యాయమూర్తి నేడు విచారణ చేసి కస్టడీకి ఇచ్చే ఆవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు.
Read also: నారా భువనేశ్వరికి గోల్డెన్ పీకాక్ అవార్డు

అప్పన్న కస్టడీకి సిట్ పిటిషన్ వైవి సుబ్బారెడ్డికి నోటీసులు సిద్ధం
కల్తీ నెయ్యి వ్యవహారంలో 2022లోనే అప్పన్న సుబ్బారెడ్డి వద్ద పనిచేస్తూ భారీగా కుట్రలకు తెరలేపారని, బోలేబాబాడెయిరీతోబాటు ఏఆర్ డెయిరీ,వైష్ణవి డెయిరీ, ప్రీమియర్ గ్రిపుడ్స్ తో ఒప్పందంతో భారీగా కమీషన్లు 50లక్షల వరకు రాబట్టారనేది సిట్ విచారణలో వెలుగుచూసిన అంశాలు. అంతేగాక అప్పన్న బ్యాంకు లావాదేవీలోల్ల 4.50కోట్ల రూపాయలు నిల్వ ఉండటం, ఆయన పేరున కొన్ని చోట్ల 14వరకు. స్థలాలు, ప్లాట్లు ఉన్నాయని సిట్ సేకరించిన సమాచారం. ఈ సమాచారంతో మరింత కీలకంగా ఆధారాలు రాబట్టేందుకు మాజీ చైర్మన్, రాజ్యసభసభ్యుడు వైవి సుబ్బారెడ్డికి నోటీసులు జారీచేసి విచారణ చేయాలని సిట్ నిర్ణయించింది. అప్పన్నను కస్టడీకి తీసుకునే ముందు వైవి కి నోటీసలు జారీకానున్నాయి. కల్తీనెయ్యి బాగోతంలో ఇప్పటికే కొనుగోళ్ళ జిఎంను పూర్తిగా విచారణ చేసిన సిట్ ఆ సమాచారంతో సుబ్బారెడ్డిని విచారణ చేయాలని ఏసిబి న్యాయమూర్తికి వివరించినట్లు తెలుస్తోంది. 2019లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పటి సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయి వైవి సుబ్బారెడ్డిని టిటిడి బోర్డు చైర్మన్గా నియమించింది. 2022లోనూ ఆయనకు మళ్ళీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు.
ఆ సమయంలో ఆయన తన అనుచరులకు పెత్తనం ఇచ్చారనేది సిబిఐ సేకరించిన సమాచారం. 2020నుండే ఎండి నెయ్యిసరఫరా టెండర్లు దక్కించుకుని చివరకు కల్తీనెయ్యి పంపిన కేసు విచారణలో కీలక పరిణామాలు ఇప్పుడు చోటుచేసుకుంటున్నాయి. కల్తీనెయ్యి పాపంలో అసలు సూత్రధారులు ఎవరున్నారనే విషయం ఇప్పుడు తేల్చేపనిలో నిమగ్నమైంది. ఇప్పటికే కల్తీనెయ్యి పాపంలో పాత్రధారులైన ఏఆర్ డైరీ రాజశేఖరన్తో బాటు ひもり చారులు ఉత్తరప్రదేశకు, ఉత్తరాఖండ్ రూర్కే బోలేబాబాడైరీకి చెందిన అప్పటి డైరెక్టర్లు విషీన్ జైన్, షోమిల్ జైన్, వైష్ణవీడైరీ (పెనుబాక)సిఇఒఆపూర్వవినయ్కంత్చావ్దాలను అరెస్టుచేసింది. తాజాగా అప్పన్న ఆరెస్ట్లో కల్తీనెయ్యి గుట్టులో విస్తుబోయే విషయాలు వెల్లడయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: