తిరుమల పరకామణి చోరీ కేసు (Tirumala Parakamani Case) లో కీలక పరిణామం చోటుచేసుకుంది, ఈ కేసుకు సంబంధించి లోక్ అదాలత్ వద్ద జరిగిన రాజీ వ్యవహారంపై సీఐడీ (CID) అదనపు నివేదికను హైకోర్టుకు సమర్పించింది, ఈ అదనపు నివేదికకు సంబంధించిన మరో రెండు సెట్‌లను సీల్డ్ కవర్‌లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు సమర్పించాలని హైకోర్టు సీఐడీని ఆదేశించింది.
Read Also: AP: “అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన” పాల్గొనాలని నేతలకు బాబు పిలుపు
లోక్ అదాలత్ అవార్డు చట్టబద్ధతపై విచారణ
లోక్ అదాలత్ అవార్డ్ చట్టబద్ధతను నిర్ధారించడానికి విచారణ జరుపుతున్న ముఖ్య న్యాయమూర్తి (CJ) నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలన నిమిత్తం ఈ నివేదికలను వారి ముందు ఉంచాలని హైకోర్టు రిజిస్ట్రీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది, సీఐడీ సమర్పించిన అదనపు నివేదికను పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేయడానికి, కోర్టు తదుపరి విచారణను రేపటికి (బుధవారానికి) వాయిదా వేసింది.

రాజీ వ్యవహారం మరియు ఆస్తుల బదిలీ
ఈ కేసులో నిందితుడు రవికుమార్ తరఫు సీనియర్ న్యాయవాది, సీఐడీ నివేదికను తమకు అందజేయాలని చేసిన అభ్యర్థనను న్యాయస్థానం గతంలో తోసిపుచ్చింది, అంతకుముందు, పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారం మరియు రవికుమార్ ఆస్తులపై సీఐడీ అధికారులు నివేదికలను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు అందజేశారు.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, 2023 ఏప్రిల్ 29న పరకామణి విధుల్లో ఉన్న రవికుమార్ అమెరికన్ డాలర్లను అపహరిస్తూ దొరికిపోయాడు, అయితే తొలిసారి దొంగతనం చేశానంటూ రవికుమార్‌తో క్షమాపణ చెప్పించి, ప్రభుత్వ లెక్కల ప్రకారం అప్పట్లో 14 కోట్ల 43 లక్షల విలువైన రవికుమార్ ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడ్ (Gift Deed) గా ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు, 2023 జూన్ 19న ఆ మేరకు తీర్మానం చేయడం, ఆ తర్వాత మూడు నెలలకే కేసును రాజీ కుదర్చడం వెనుక ఉన్న అంశాలపై విచారణ జరిపిన సీఐడీ హైకోర్టుకు (High Court) నివేదిక సమర్పించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: