తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పిస్తానని భక్తులను నమ్మించి, కోటి రూపాయలకు పైగా మోసం చేసిన బురిగాల అశోక్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా, చంద్రగిరికి చెందిన ఇతను ‘రాక్‌స్టార్ ఈవెంట్స్’ అనే నకిలీ సంస్థను సృష్టించి, తనకు రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయని నమ్మబలికాడు. శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవం, సుప్రభాత సేవ వంటి టికెట్లతో పాటు గదులు కూడా సులభంగా ఇప్పిస్తానని అమాయక భక్తుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసేవాడు. భక్తులు తిరుమలకు చేరుకున్నాక, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి తప్పించుకునేవాడు.
Read Also: Nara Lokesh: ఆస్ట్రేలియా గ్రిఫిత్ యూనివర్సిటీతో ఏపీ కీలక భాగస్వామ్యం

ఇటీవల హైదరాబాద్‌కు చెందిన భక్తులకు(Tirumala) మోసం జరగడంతో వారు టీటీడీ విజిలెన్స్(TTD Vigilance) అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన తిరుమల టూటౌన్ పోలీసులు ఈ నెల 16న కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో అశోక్ కుమార్ రెడ్డి బ్యాంకు ఖాతాలో కేవలం ఏడాది కాలంలోనే కోటి రూపాయలకు పైగా లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. అమన్ గోయల్, గౌతమ్ గుప్తా, రాధిక అగర్వాల్ వంటి ఎందరినో ఇతను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో భక్తులు ఇలాంటి దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు, గదుల బుకింగ్ కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఆశ్రయించాలని స్పష్టం చేశారు. ఎవరైనా మోసం చేయాలని ప్రయత్నిస్తే, వెంటనే తిరుమల వన్‌టౌన్ (94407 96769), టూటౌన్ (94407 96772) పోలీసులకు తెలియజేయాలని కోరారు.
శ్రీవారి దర్శనం పేరుతో మోసాలకు పాల్పడిన నిందితుడి పేరు ఏమిటి?
తిరుపతి జిల్లా, చంద్రగిరికి చెందిన బురిగాల అశోక్ కుమార్ రెడ్డి.
నిందితుడు ఏ పేరుతో నకిలీ సంస్థను నడిపాడు?
రాక్‌స్టార్ ఈవెంట్స్’ పేరుతో నకిలీ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను నడిపాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: