21న వర్చువల్ సేవా, 24న అంగప్రదక్షిణ టోకెన్లు
తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనాలకు సంబంధించి 2026 ఫిబ్రవరి నెలాకోటా టిక్కెట్లు మంగళవారం ఉదయం నుండి టిటిడి (Tirumala) ఆన్లైన్లో విడుదల చేస్తోంది. ఇందుకు టిటిడి(TTD) ఐటి విభాగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరినెలకు సంబంధించి రేపు మంగళవారం 18వతేదీ ఉదయం 10గం టలకు ఆన్లైన్లో ఆర్జితసేవా టిక్కెట్లు విడుదల చేస్తే 20వతేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఈ టిక్కెట్లు పొందిన భక్తులు 20వతేదీ నుండి 22వతేదీ మద్యాహ్నం 12గంటలలోపు సొమ్ముచెల్లించి టిక్కెట్లు మంజూరవుతాయి.
Read also: సీఎం స్టాలిన్ సహా సినీ ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు

శ్రీవాణి, వృద్ధులు–దివ్యాంగుల కోటాల విడుదల తేదీలు ఖరారు
21వ తేదీ ఉదయం 10గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపా లంకారసేవల టిక్కెట్లను విడుదల చేయనుంది. 24న ఉదయం 10గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు,(Tirumala) శ్రీవాణి టిక్కెట్లు 24న ఉదయం 11గంటలకు, వృద్ధులు దివ్యాంగులు దర్శన కోటా 24వతేదీ మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తారు. 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటా 25న ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. గదుల కోటాను మధ్యాహ్నం 3గం టలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులుఆన్లైన్లో స్వామివారి దర్శన టిక్కె ట్లును ‘టిటిదేవస్థానమ్స్. ఎపి.జివొవి.ఇన్’ వెబ్సైట్గాద్వారా బుక్చేసుకోవాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: