కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆస్తానమైన తిరుమలలో పూర్తిస్థాయి విద్యుత్ వాహనాల(Tirumala Electric Buses) వ్యవస్థను అమలు చేయడానికి టీటీడీ వేగంగా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం నడుస్తున్న డీజిల్, పెట్రోల్ ట్యాక్సీలు మరియు టీటీడీ అద్దె వాహనాలను దశలవారీగా తొలగించే ప్రణాళికను అధికారులు రూపొందించారు.
టీటీడీ(TTD) అదనపు ఈవో వెంకయ్య చౌదరి(Venkaiah Chowdhary) తెలిపారు. తిరుమల–తిరుపతి మార్గంలో విద్యుత్ బస్సులను మాత్రమే నడపే విధంగా ప్రణాళిక సిద్ధమవుతోంది. పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పాత ఇంధన వాహనాల వినియోగాన్ని తగ్గించే నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.
Read Also: Tirumala Vaikunta Dwaram: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం వివరాలు

విద్యుత్ వాహనాలతో మార్చే ప్రక్రియ
తిరుపతిలోని పద్మావతి గెస్ట్‌హౌస్(Padmavati Guesthouse)లో కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, ఆర్టీసీ, టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశం ప్రధాన చర్చగా నిలిచింది. తిరుమలలో సేవలందిస్తున్న ట్యాక్సీలు, అద్దె వాహనాలను విద్యుత్ వాహనాలతో మార్చే ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. రాబోయే టీటీడీ బోర్డు సమావేశంలో దీనిపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సీనియర్ కన్సల్టెంట్ కునాల్ జోషి వివిధ సాంకేతిక, రవాణా అంశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో టీటీడీ(TTD) డీఎఫ్‌ఓ ఫణికుమార్ నాయుడు, వీజీవో సురేంద్ర, ఐటీ డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు నాయుడు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: