ఇటీవల కాలంలో మున్నెన్నడూ లేని విధంగా శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు రికార్డుస్థాయిలో స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనంలో భాగంగా శుక్రవారం నుంచి సాధారణ భక్తులకు దర్శన అవకాశం కల్పించడంతో (Tirumala) నిన్న 83,032 మంది భక్తులు దర్శించుకోగా 27,372 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్‌లో నిలబడి దర్శనం చేసుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 4.10 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టోకెన్లు లేని భక్తులకు20 గంటల్లో సర్వదర్శనం అవుతుందని తెలిపారు.
Read also: Andhra Pradesh: ఈ నెలలో స్కూళ్లకు 14 రోజులు సెలవులు?

తిరుమల (Tirumala) శ్రీవారి సన్నిధిలో వసతులు, నిర్వహణ మెరుగుపడటంతో భక్తులకు మెరుగైన దర్శన భాగ్యం లభిస్తోంది. 2025లో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, లడ్డూల విక్రయం, ఇతర సేవలన్నీ మెరుగుపడ్డాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ (TTD) పాలకమండలి కొత్త ప్రణాళికలు అమలు చేసింది. 2024లో 2.55 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా, 2025లో 2.61 కోట్ల మంది దర్శించుకున్నారు. 2024లో హుండీ ఆదాయం 1365 కోట్లు కాగా, 2025లో 1383.90 కోట్లుగా నమోదైంది. 2026లోనూ పలు సంస్కరణలు అమలు చేయాలని టీటీడీ యోచిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: