క్యుఆర్ కోడ్ యాప్ అందుబాటులోకి సాంకేతిక నిఘా పెంచిన టిటిడి
Tirumala: పరిస్థితులకు అనుగుణంగా హిందూ ధార్మికసంస్థ తిరుమల తిరుపతిదేవస్థానం సామాన్యభక్తులకు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనంతోబాటు వసతి కల్పనలో మరింత మెరుగైన మార్పులు తీసుకు రావడానికి వీలుగా భక్తుల నుండి అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం టిటిడి (TTD) సాంకేతికంగా నిఘా పెట్టింది. తిరుమలలో జరిగే పొరబాట్లు, తప్పులు, వసతి సౌకర్యం ఎలా ఉంది.. స్వామివారి దర్శనం బాగా జరిగిందా అనే ప్రశ్నలు శ్రీవారి సేవకులు భక్తులను అడిగి వారినుండి అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ ఫీడ్బ్యాక్ను టిటిడి ఐటి విభాగానికి చేరవేస్తే ఏదేని తీవ్ర సమస్యలు ఉంటే అక్కడ నుండి టిటిడి ఛైర్మన్ బిఆర్నాయుడుకు (BR Naidu), టిటిడి ఇఒ శ్యామలరావు (EO Shyamala Rao), అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరికి (Chirumamilla Venkaiah Chowdhury) అందుతుంది. క్షేత్రస్థాయిలో ఇఒ, అదనపు ఇఒ చేపట్టాల్సిన మార్పులు, మరింత మెరుగైన సౌక ర్యాలు కల్పించేందుకు కార్యాచరణ అమలుచేస్తారు. కొండకు చేరుకున్న భక్తులు తొలుత వసతి కోసం, తరువాత స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో నిరీక్షించే సమయంలో ఎదురయ్యే సమస్యలు, సౌలభ్యంగా ఉన్న సేవలు విధానం ప్రశ్నల రూపంలో శ్రీవారిసేవకులకు తెలియజేసే వీలుకలిగింది. లడ్డూ ప్రసాదాల నాణ్యత, రుచి, తరిగొండవెంగమాంబ అన్నప్రసాదంలో అన్నప్రసాదాలు వడ్డన, 205 మార్పులు తదితర అంశాలపై సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. భక్తులు కూడా నిర్మోహ మాటంగా తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం కలిగింది. ఐవిఆర్ఎస్ (IVRS), వాట్సాప్ (93993 99399), ఈ సర్వే, శ్రీవారిసేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ తీసుకోవడమేగాక 16 అంశాలపై భక్తులు తమ అభిప్రాయాలు చెప్పడానికి వీలుగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ కోసం ఓ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కోడ్యప్ను తిరుమలకొండపై ప్రధాన కూడళ్లలో, వసతికల్పన విచారణ కార్యాలయాల వద్ద ఏర్పాటుచేశారు. భక్తులు ఈవిధానంలో అభిప్రాయాలు, ఫిర్యా దులు, సలహాలుఇస్తే టిటిడి ఉద్యో గులు, అధికారుల్లో బాధ్యతను పెంపొందించే విధంగా మారింది. ఇలా ప్రతిరోజూ తిరుమలకు వచ్చిన భక్తుల ద్వారా అభిప్రాయాలు తీసుకుని ఏ విభాగంలోనైనా లోటుపాట్లు, మార్పులు చేపట్టే విషయంలో చర్యలు తీసుకునే వెసలుబాటు కలిగింది.

90వేలమందిభక్తుల నుండి అభిప్రాయం:
Tirumala: కలియుగప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి దేశం నలుమూలలనుండేగాక విదేశాల నుండి రోజుకు సరాసరి 90వేలమంది వరకు భక్తులు కొండపైకి వస్తున్నారు. సుమారుగా 80 వేలమంది వరకు యాత్రికులు ఇష్టదైవాన్ని దర్శించుకుంటున్నారు. వారాంతం శని, ఆదివారాల్లో ఈ రద్దీ మరింతగా పెరిగి 1.20 లక్షలమంది వరకు చేరుకుంటున్నారు. అదనంగా మరో పదివేలమంది వరకు భక్తులకు శ్రీవారి దర్శనం చేయిస్తున్నారు. ఈ నేపధ్యంలో సాధారణ రోజుల్లో కూడా దేవదేవుని దర్శనానికి 10గంటలు సమయం వేచివుండాల్సిన అవసరం ఉంది. గంటల తరబడి వెలుపల క్యూలైన్లలో వేచివుండటం, వైకుంఠమ్ 1, 2క్యూకాంప్లెక్స్ కంపార్టుమెంట్లలోనూ గంటల తరబడి నిరీక్షణ తప్పడంలేదు. రోజుకు అన్నప్రసాదాలు కూడా లక్షమందికి పైగా భక్తులు స్వీకరిస్తున్నారు. ఇక తిరుమలలో సామాన్యభక్తుల కోసం ఆఫ్లైన్లోనూ గదులు కేటాయింపు సిఆర్ఒ కార్యాలయం, ఎంబిసి, పద్మావతివిచారణ కార్యాలయం వద్ద పారదర్శకంగానే జరుగుతోంది. ప్రపంచంలోనే పెద్ద ధార్మికసంస్థ టిటిడి ఇప్పుడు భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు అభిప్రాయసేకరణ కూడా ఒక కీలకంగా మారింది. ఐవిఆర్ఎస్ ద్వారా భక్తులు తిరుమలలోని అన్నప్రసాదం, కల్యాణకట్ట, వసతికోసం, దర్శనం, లడ్డూకౌంటర్లు, లగేజీకౌంటర్లు, క్యూలైన్ల వద్ద ఉన్న సేవలపై తమ అభిప్రాయాలను, సూచనలు చెప్పే వెసలుబాటు కలిగింది. ప్రస్తుతం శ్రీవారిసేవకుల ద్వారా మాన్యువల్గా అభిప్రాయాలు తీసుకుంటున్నారు.
తిరుమల, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై త్వరలోనే టిటిడి మొబైల్యాప్, టిటిడి బుకింగ్ పోర్టల్ నుండి భక్తులు విలువైన సలహాలు, సూచనలు తీసుకోవడానికి అప్లికేషన్ రూపొందించబడుతున్నది. భక్తుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ సేవలను మరింత మెరుగుపరచడంకోసం ఈ సర్వేల ద్వారా వారి ప్రత్యక్ష అనుభవాలను సేకరించడం జరుగుతోంది. ఈ విధానాల ద్వారా భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేసి ఆన్లైన్ సేవలను మెరుగుపరిచేందుకు తోడ్పాటునివ్వాలని టిటిడి విజప్తి చేసింది.
Read also: Budameru : బుడమేరు రిటైనింగ్ వాల్ పూర్తి: మంత్రి నిమ్మల