ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలతో వెంకన్న మేల్కొలుపు
తిరుమల : వైఖానస ఆగమోక్తంగా పూజలందుకుంటున్న తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి వేకువజామున నిర్వహించే సుప్రభాతసేవ ఈనెల 16వతేదీ నుండి రద్దుచేశారు. ఆ స్థానంలో ధనుర్మాసం సందర్భంగా నెలరోజులపాటు గోదాదేవి తిరుప్పావై (Tiruppavai) పాశురాలను వేదపండితులు , ఆలయ అర్చకులు పారాయణం చేసి శ్రీవారిని మేల్కొలుపుతారు. ప్రతి ఏడాది ధనుర్మాసంలో సుప్రభాతసేవ స్థానంలో తిరుప్పావై పాశురాలు పఠించడం ఆనవాయితీ. తిరుమల, తిరుపతితో పాటు దేశవ్యాప్తంగా 233 కేంద్రాలలో తిరుప్పావై పారాయణం జరుగుతుంది. ఈనెల 16 నుండి 2026 జనవరి 14వ తేదీ వరకు పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Read also: Vangalapudi Anitha: తిరుపతి విద్యార్థినిపై దాడి: హోంమంత్రి కఠిన స్పందన

Break for Suprabhata Seva from 16 in Tirumala
ఈ వ్రతం చేయడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా
ఇందులో భాగంగా తిరుపతితో పాటు ఆంధ్రప్రదేశ్ 76 కేంద్రాలు, తెలంగాణ 57 కేంద్రాలు, తమిళనాడు 73, కర్ణాటక 21, పాండిచ్చేరి 4, న్యూఢిల్లీ, ఒడిశాలో ఒకొక్క కేంద్రంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు. 12 మంది ఆళ్వారులలో ఒకరైన గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశారు. ఈ వ్రతం చేయడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుంది. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో పేర్కొనబడింది. ఈ తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే. దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: