- అప్పటి పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులకు హైకోర్టు ఆదేశం
- నిందితుడు రవికుమార్ను తప్పించడం వెనుక కీలకమెవరో!?
తిరుమల : మూడు సంవత్సరాల క్రిందట తిరుమల పరకామణిలో చోరీ కేసు ఉదంతం ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారి అప్పటి పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే వరకు వరిస్థితి దారితీసింది. ఈ కేసులో క్షేత్రస్థాయిలో దర్యాప్తు, విచారణ చేపట్టిన సిఐడి అధికారులు ఇచ్చిన నివేదికలతో రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం మంగళవారం ఈ కేసుతో సంబంధం ఉన్న అప్పటి పోలీస్ అధికారుల పైక్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసింది.
Read also: AP: ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనేసీమ సస్యశ్యామలం
ఈ కేసు దర్యాప్తును మరింత వేగంగా ముందుకు తీసుకెళ్ళాలని సిఐడి, ఏసిబి అధికారుల బృందాన్ని ఆదేశించింది. మళ్ళీ ఈ కేసు విచారణను గురువారం (రేపటికి)కు వాయిదా వేసింది. నిందితులతో పోలీసులు చేతులు కలిపి ఈ కేసును పక్కదారిపట్టించారని సిఐడి నివేదిక ఇచ్చింది. సిఐడి నివేదికల ఆధారంగా నిందితులతో కొందరు పోలీస్ అధికారులు చేతులు కలిపారని స్పష్టంగా ఉందని తెలిపింది.
వారిపై క్రిమినల్ చర్యలు కూడా అవసరమని అభిప్రాయంతో
దర్యాప్తులో తేలిన అంశాలపై సిఐడి, ఏసిబి విచారణ కొనసాగించవచ్చని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే 2023లో పరకామణి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న, సిఐడి అధికారుల విచారణకు హాజరైన అప్పటి తిరుమల వన్డేన్ సిఐ పి. జగన్మోహన్రెడ్డి, టూటౌన్ సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ లక్ష్మీరెడ్డిలను ఇప్పటికే విఆర్కు పంపారు. ఇప్పుడు వీరిపై క్రిమినల్ కేసు నమోదు చేయనుండటంతో పరిణామం ఎక్కడకు దారితీస్తుందనేది ఆందోళన కలిగించే అంశం.

కేసులు నమోదు
ఇదేగాక ఈ కేసుకు సంబంధించిన పత్రాలు తారుమారుచేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గత వన్ టౌన్ సిఐ విజయకుమార్ కూడా విఆర్లో ఉన్నారు. ఆయనపై ఎలాంటి విచారణ చేపట్టనున్నారనేది ఉత్కంఠగా మారింది. తిరుమల పరకామణిలో 2023 ఏప్రిల్ 29న నెలలో అమెరికన్ డాలర్లు చోరీ చేసినా,గత ఏవిఎస్ సతీశ్ కుమార్ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ చేసినా నిందితుడైన సివి రవికుమార్ను ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారని, ఈ కేసులో నిందితుడిపట్ల ఉదాసీనత చూపాల్సినఅవసరం ఏముందని సిఐడి అధికారులు గత
నవంబర్ నెలలోనే అప్పుడు తిరుమలలో పనిచేసిన సిఐ జగన్మోహన్రెడ్డిని, సిఐ చంద్రశేఖర్ను, ఎస్ఐఐ లక్ష్మీరెడ్డిని విచారణ చేసి వివరణ రాబట్టారు.
ఇంకా ఈ కేసులో మీపై ఎవరైనా ఒత్తిడి చేశారా, టిటిడి అధికారులు అప్పటి బోర్డు కలుగజేసుకుందా అనే ప్రశ్నలు కూడా సమాధానాలు రాబట్టి నివేదిక సిద్ధం చేయడం సంచలనంగా మారింది. 2023 ఏప్రిల్ పరకామణిలో గుమస్తాగా ఉన్న సివి రవికుమార్ ఏకంగా 920 విదేశీ డాలర్లు, 11నోట్లు చోరీ చేసిన తరువాత అప్పటి ఏవిఎస్ఐ సతీశ్కుమార్ ఫిర్యాదుపై ఎఫ్ఎఆర్ చేసిన తరువాత చట్టప్రకారం నిందితుడ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదనేది ఇంకా కీలకంగా చివరకు మూడునెలల్లోనే లోక్అదాలత్లో కేసు రాజీ చేసుకున్నారనేది పోలీసుల సమాచారం. టిటిడిలో ఉన్నతాధికారులు, బోర్డు కీలకమని సిఐడి దృష్టికి తీసుకెళ్ళారు. ఈ కేసులో ఇప్పుడు గత పోలీస్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదుకు సిద్ధమవడంతో ఇక ఏం జరగనుందనేది తేలాల్సి ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: