తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల(Tirumala)లో ప్రతి చెట్టూ, ప్రతి రాయి, ప్రతి పుష్పం, లతలు తరులు ఒకటేమిటీ అన్ని ఆద్యంత దేవదేవుని సేవకే అన్నట్లు ముస్తాబవుతాయి. ఏడుకొండల వేంకటేశ్వరస్వామి భక్తజన ప్రియుడేకాదు, పుష్పాలం కారప్రియుడుకూడా. ఇలా వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండపై సాలకట్లవార్షిక బ్రహ్మోత్సవ సంరంభం ఆరంభమైంది.

ఇందుకు తొలిఘట్టంగా మంగళవారం (రేపు) రాత్రి అంకురార్పణ చేపట్టనున్నారు. ఆలయం పైభాగాన, పరిసరాల్లో, కల్యాణవేదిక ఉద్యానవనం ప్రాంతాల్లో పలు రకాల కళాకృతులు, ఫల, పుష్ప కళాకృతులు తీర్చిదిద్దారు. స్వామివారి చెంత మేమూ సేవకులమేనంటూ ఆనందపరవశులవుతున్నారు. దేవలోకంలో శ్రీమహావిష్ణువు (Lord Vishnu)కలియుగంలో శ్రీవేంకటేశ్వర స్వామి పుష్పాలతో ఆనందపరవశులవుతారు. అందుకే తిరుమలలో మహిళలు కూడా పుష్పాలు ధరించరాదనేది ఆచారం. ఒకటేమిటి భక్తులు భక్తిభావంతో తన్మయత్వం చెందేలా అద్భుతంగా ఏర్పాట్లు వున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: