రెక్కాడితేనే డొక్క నిండని అత్యాధునిక అకాలాలు. నిరుద్యోగుల బతుకు బహు వెతలు. నిరుపేదల అనంత ఆకలి పోరాటాలు. నైపుణ్య చేతులకే పరిమితమైన పనులు, ఆదాయాలు. దినసరి కూలీ రేట్ల పతనాలు. ఆదాయం బహు పలుచన, కోరికలు ఆకాశాన. చుట్టూ సమస్యల విష వలయాలు. రేపటికి లేదు భరోసా. నేడు పని దొరుకుతుందన్న ఆశలు కరువు. ఇన్ని సంక్షోభాల నడుమ డిజిటల్ యువత తమ కుటుంబ స్థాయిని మరిచి, విచ్చలవిడిగా, అనాలోచితంగా, విచక్షణారహితంగా ధనాన్ని నీళ్ల వలె ఖర్చు చేయడం చూస్తున్నాం. ఆదాయానికి, ఖర్చుకు సంబంధం లేకుండా పోతున్నది. నేటి ఆదాయం రేపటి విప త్తుల్లో ఆదుకుంటుందన్న ఇంగితం మరిచారు యువజను లు. ఆర్థిక క్రమశిక్షణ లోపించి కుటుంబాలు విచ్ఛిన్నం అవు తూ, అశాంతి నిలయాలుగా దర్శనమిస్తున్నాయి. రాబడి కన్న ఖర్చులు అధికం అవుతున్నాయి. ఎంత సంపాదిస్తు న్నామనేది ముఖ్యం కాదని, ఎంత ఆదా లేదా పొదుపు చేస్తున్నామనేది ప్రధానమని తెలుసుకోని యువత నేడు ఆర్ధిక నిరక్షరాస్యులుగా మిగిలిపోతున్నారు. రేపటి ఆపదలు చెప్పిరావు. ఆపద వచ్చినపుడు బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీగా ఉంటుంది. ఇలాంటి ఆర్థిక సంకట స్థితికి కారణం నేటి ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పొదుపు (thrift)ప్రాధాన్యం తెలియకపోవడమే అని నిర్ధారించాల్సిన సమయం ఆసన్న మైంది. నేటి విద్యా వ్యవస్థలో ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు పాఠాలు చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. ఎంత ఖర్చు పెడితే అంత గౌరవం పెరుగుతుందనే దురభిప్రాయం లో యువత కొట్టుమిట్టాడుతోంది. చిన్నప్పటి నుంచే పిల్లల్లో పొదుపు పట్ల అవగాహన కల్పించాలి. పొదుపుకు, పిసినారి తనానికి వ్యత్యాసం నేర్పాలి. సంపాదించిన నెలసరి వేతనం తో కొంతమేరకు పొదుపు చేయడం కనీస కర్తవ్యమని నేర్పు కోవాలి. మొక్కై వంగనిదే, మానై వంగదు కదా. లేత మన సుల్లో ఆర్థిక అక్షరాస్యత బీజాలు నాటాలి. చిన్నతనంలో పొదుపుపాఠాలు నేర్పిన పిల్లలు రేపటి కుటుంబా నికి సుఖ సంతోషాలను అందించగలదని తెలుసుకోవాలి. కనీస అవ సరాలకు, విలాసాలకు వ్యత్యాసం నేర్పాలి.
Read Also : http://Delhi blast: క్లాస్ లో తాలిబన్ రూల్స్ పాటించే ఉమర్ బాగోతం

నేటి డిజిటల్ యువత ఉద్యోగాలు చేస్తూ పరిమిత వేతనాలను పొందుతున్నారు. తాము పొందిన వేతనాలతో కుటుంబాలను సజావుగా నడపడం లేదు. ప్రాధాన్యాలు మరిచిపోతున్నారు. విలాసాలు కూడా కనీస అవసరాలు అనుకుంటున్నారు. డబ్బు చేతిలో ఉన్నపుడు చేతులకు ఎముకలు లేవన్నట్లు అనాలోచితంగా ఖర్చు చేస్తున్నారు. ధనం ఉన్నపుడు ఎగిరి పడడంతో పాటు లేనప్పుడు అప్పులు చేయడానికి కూడా వెనకాడడం లేదు. విలాసాలకు, కనీస అవసరాలకు వ్యత్యా సాలు మరిచి పోతున్నారు. ఎంత సంపాదించిన నెలలోని తొలి వారంలోనే ఖర్చు పెడు తున్నారు. రేపటి అనుకోని ఆపదలను తట్టుకోవడానికి పొదుపు ధనం వినియోగపడు తుందనే కనీస అవగాహన కోల్పోతున్నారు. నేటి విద్యాల యాలు మార్కులు, ర్యాంకుల పాఠాలు నేర్పుతున్నారు. ఉద్యోగాలు పొందడానికి అవసర విద్యను బోధిస్తున్నారు. సంపాదించిన ధనాన్ని పొదుపుగా వాడుకోవడాన్ని నేర్పేవిద్య కరువైయ్యింది. చాప ఉన్నంత వరకే కాళ్లు చాపుకోవడం నేర్పాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడంబోధించాలి. ప్రమాదాలు చెప్పి రావని, అనారోగ్యాలు అడిగి రావని తెలు సుకోవాలి. అనుకోని విపత్తుల్లో ఆదా చేసిన డబ్బు ఆదు కుంటుందనే ఇంగితం మరిచాం. చిన్నతనం నుంచే పాకెట మనీని దాచుకోవడం నేర్పించాలి. పిల్లలతో పాటు యువతకు డబ్బు ప్రాధాన్యాన్ని, ఖర్చు చేసే పద్ధతులను, పొదుపు (thrift) చేయవలసిన అవసరాన్ని బోధించాలి. తమ బ్యాంక్ లో పొదుపు ధనాన్ని దాచుకోవడం బోధించాలి. ప్రతి నెల వేత నంలో కొంత శాతాన్ని విధిగా పొదుపు చేయడం నేర్చుకోవాలి. మన అలవాట్లకు, వ్యయానికి సమీప సంబంధం ఉందని తెలపాలి. నేటి పొదుపు రేపటి భరోసా కావాలి. నేటి బాలలే రేపటి పౌరులు. నేటి ఆదాయమే రేపటి ప్రమాదాలకు చికిత్స. నేటి పొదుపు చేసిన ధనమే రేపటి కుటుంబ సంతోషాలకు పునాది.
– డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: