ఆంధ్రప్రదేశ్‌ను పునరుత్పాదక ఇంధనంలో ముందంజలో నిలబెట్టాలని సీఎం చంద్రబాబు (Chandrababu) తలపోస్తున్నారు. సమకాలీన అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ కారిడార్‌గా అభివృద్ధి చేయాలన్నది ఆయన లక్ష్యం.అమరావతిలో బుధవారం జరిగిన సమీక్షలో విద్యుత్ సరఫరా, పెట్టుబడులు, ఛార్జీలపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో విద్యుత్ శాఖ (Electricity Department) మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.గ్రీన్ ఎనర్జీతోనే భవిష్యత్ ఉంటుంది, అని సీఎం స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగం రాబోయే 2-3 ఏళ్లలో 8.9% పెరుగుతుందన్న అంచనుల మధ్య, అవసరాలకు తగినంతగా పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి చేయాలని సూచించారు.ఇంధన వ్యయం తగ్గించి, ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు. అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటివాటిని వినియోగించి ఉత్పత్తిని మరింత సమర్థవంతంగా చేయాలని అన్నారు.

వినియోగదారులపై ఛార్జీల భారం వద్దు
విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపకూడదని సీఎం స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలకే ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.APTRANSCOకి చెందిన ఫైబర్ నెట్‌వర్క్‌ను లీజుకి ఇవ్వడం ద్వారా రూ.7,000 కోట్లు ఆదాయం రావచ్చని అంచనా. యూనిట్ విద్యుత్ కొనుగోలు ధరను రూ.4.80లోపు పరిమితం చేయాలని సీఎస్ విజయానంద్ తెలిపారు.
విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గించాలి
ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ నష్టం 9 శాతం. దీన్ని తగ్గించడంపై సీఎం దృష్టి పెట్టారు. ఫీడర్ల నిర్వహణ మెరుగుపరచడం, స్థానికంగా విద్యుత్ ఉత్పత్తి చేసి అదే ప్రాంతంలో వినియోగించడం ద్వారా నష్టాలు తగ్గించవచ్చని అన్నారు.గతంలో అమలు చేసిన ఎనర్జీ ఆడిటింగ్ విధానాన్ని మళ్లీ తెరపైకి తేనున్నారు. విద్యుత్ చౌర్యం, అసమర్థత తగ్గించేందుకు ఇది కీలకం.థర్మల్ విద్యుత్తుకి ఖర్చు రూ.5-6 మధ్యలో ఉంటే, పవన విద్యుత్‌కు కేవలం రూ.4.6. దీంతో గ్రీన్ ఎనర్జీదే ఎక్కువ ప్రయోజనాల దారి అని స్పష్టం చేశారు.రాష్ట్రంలో 65 గిగావాట్ల పవన విద్యుత్‌కి అవకాశాలున్నాయి. రాయలసీమలో పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్టులకు అనుకూల పరిస్థితులున్నాయి. ఇవన్నీ త్వరితగతిన అభివృద్ధి చేయాలని సూచించారు.
పీఎం-సూర్యఘర్ రూఫ్‌టాప్ ప్రాజెక్ట్ వేగవంతం
పీఎం సూర్యఘర్ సోలార్ పథకాన్ని ప్రతీ నియోజకవర్గంలో కనీసం 10,000 ఇళ్ల వరకు విస్తరించాలన్నారు. ప్రతి నెలా ఈ పథకంపై సమీక్ష చేస్తానని తెలిపారు.
వ్యవసాయ కుటుంబాలకు ఎలాంటి స్మార్ట్ మీటర్లు అమర్చకూడదని స్పష్టం చేశారు. పాత విద్యుత్ లైన్లను మార్చి ప్రమాదాల నుంచి తప్పించేందుకు Predictive Maintenance టెక్నాలజీ వాడాలని సూచించారు.ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ అందించాలన్నది చంద్రబాబు ధ్యేయం. ఇది సాధించేందుకు అన్ని మార్గాలు పరిశీలించాలని చెప్పారు.
Read Also