విజయవాడ :మత్స్యకారుల జీవనోపాధికి భద్రత, భరోసా కూటమి ప్రభుత్వ లక్ష్యంమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(DCM Pawan) స్పష్టం చేసారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయం(Office) నుంచి ఒక ప్రకటన విడుదల చేసారు. డిసెంబర్ లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మన మత్స్యకారుల సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తీరాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవనోపాధికి భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను.
Read Also: HYD: స్పీకర్ గడ్డం ప్రసాద్లో కడియం శ్రీహరి భేటీ

ఆదాయ మార్గాల కల్పనపైనా దృష్టి
కాకినాడ జిల్లా మత్స్యకార సోదరులకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల ప్రణాళికను అమలు చేసేందుకు రోడ్ మ్యాప్ తుది దశకు చేరింది. తీర ప్రాంతంలో అంతరించిపోతున్న మత్స్య సంపదను పెంపొందించే చర్యలతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కల్పనపైనా దృష్టి సారించాం. విశాఖ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, మత్స్య శాఖ సూచనల మేరకు రూపొందించిన ప్రత్యేక ప్రణాళికలను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
కేంద్ర ప్రభుత్వ కోస్టల్ రీజైలెన్స్ పథకం ద్వారా ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు రూ.2 కోట్లతో ప్రత్యేక చర్యలు చేపట్టబోతున్నాం. 100 రోజుల ప్రణాళక అమలులో భాగంగా మత్స్య సంపద పెంపొందించడం, వేట నైపుణ్యాన్ని పెంచడం, ప్రత్యేక రీఫ్ ల ఏర్పాటు, ప్రత్యామ్నయ ఆదాయ వనరుల సృష్టి తదితర అంశాలపై మత్స్యకారులకు అవగాహన కల్పించనున్నాం. మన మత్స్యకారులను తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు తీసుకువెళ్లి అక్కడ విజయవంతమైన కృత్రిమ రీఫ్ కల్చర్, కోస్టల్ టూరిజం యూనిట్ల సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నాం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: